వారణాసి సెట్ నుంచి కదిలొచ్చిన మహేష్ బాబు- అన్న కొడుకు ఫిల్మ్ కోసం
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు. హీరో రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. జయకృష్ణ అరంగేట్రం చేసిన ఫిల్మ్ శ్రీనివాస మంగాపురం.. ఈ నెల 30వ తేదీన విడుదల కాబోతోంది. దీంతో కృష్ణ కుటుంబం నుంచి మూడో తరం హీరో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినట్టయింది.
ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. మంగళవారం తర్వాత ఆయన నుంచి రాబోతోన్న మాస్ ఎంటర్ టైనర్ సినిమా ఇదే. ప్రముఖ నిర్మాత సీ అశ్వనీదత్ సమర్పిస్తోన్నారు. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్ కింద ఈ సినిమా తెరకెక్కింది. పీ కిరణ్ నిర్మించిన ఈ సినిమాకు తమిళ సంచలనం జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు. బాలీవుడ్ నటి రషా థదాని హీరోయిన్ గా నటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు.

శ్రీనివాస మంగాపురం సినిమాలో అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్ లో కనిపించాడు జయకృష్ణ. యాక్షన్ సీన్లల్లో అదరగొట్టాడు. సెంటిమెంట్ ను పండించడంలో సై అనిపించుకున్నాడు. తెలుగు తెరకు మరో ప్రామిసింగ్ హీరో దొరికినట్టే అనిపించుకున్నాడు. డెబ్యూ ఆఫ్ ది ఇయర్ 2026 గా జయకృష్ణ ను ఇంట్రడ్యూస్ చేస్తోంది చిత్రం యూనిట్. ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి యాక్షన్ థ్రిల్లర్ గా దీన్ని తెరకెక్కించారు.
సినిమా మొత్తం కూడా తిరుపతి బ్యాక్ గ్రౌండ్ గా సినిమా రూపుదిద్దుకుంది. మహేష్ బాబు ఎంట్రీ కూడా అశ్వనీదత్ సినిమాతోనే మొదలైన విషయం తెలిసిందే. రాజకుమారుడు మూవీని ఆయనే నిర్మించారు. కాగా.. ఈ సినిమా విడుదల దగ్గర పడటంతో మహేష్ బాబు తెర మీదికి వచ్చారు. జయకృష్ణకు విషెస్ తెలిపారు. ఈ సినిమా కోసం కుటుంబం మొత్తం కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్నామని పేర్కొన్నారు.
Extremely happy for #JaiKrishnaGhattamaneni and #RashaThadani on their debut with #SrinivasaMangapuram…. I wish the whole team the very best for July 30th!!! 🤗🤗🤗♥️♥️♥️@DirAjayBhupathi #RashaThadani @themohanbabu @AshwiniDuttCh @gvprakash @gemini_kiran @CKPicturesoffl pic.twitter.com/VPgSDQRmAn
— Mahesh Babu (@urstrulyMahesh) July 26, 2026
ఇప్పటిదాకా చూసిన టీజర్ గానీ, సాంగ్స్ గానీ.. చాలా ఆకట్టుకున్నాయని, జయకృష్ణ ఎనర్జిటిక్ గా నటించాడని ప్రశంసించారు. అశ్వనీదత్ వంటి ప్రొడ్యూసర్ చేతిలో పడటం కలిసొస్తుందని వ్యాఖ్యానించారు. తనతో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇదే బ్యానర్ లో నటించారని మహేష్ బాబు గుర్తు చేసుకున్నారు. రషా థదాని, అజయ్ భూపతి, అశ్వనిదత్, పీ కిరణ్ సహా యూనిట్ అందరికీ శుభాకాంక్షలు చెప్పారు.












Click it and Unblock the Notifications