తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వమే: ప్రధాని మోదీ
పశ్చిమ బెంగాల్ లో తొలిసారిగా బీజేపీ అధికారం చేపట్టిందని త్వరలోనే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలేనని అన్నారు. కాంగ్రెస్ ఎక్కడున్నా ఒకటే మోడల్ అని.. ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇస్తారు. ఆ తర్వాత సాకులు వెతుకుతారు. తెలంగాణలో కూడా ఇదే జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే అధికారం సాధ్యమనే నమ్మకం కలిగిందని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ సభలో పేర్కొన్నారు. అంతకుముందు 'నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ ఆయన తెలుగులో స్పీచ్ ను ప్రారంభించారు.
కాంగ్రెస్ విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంఎంసీగా మారింది.. ఎంఎంసీ అంటే ముస్లిం లీగ్ మావోవాది కాంగ్రెస్ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మావోయిస్టులతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని.. తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మావోయిస్టులపై చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ ముందుకు రాలేదని తెలిపారు. తెలంగాణ పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉంటే మావోయిస్టులను అణచివేసేవారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇప్పుడు తెలంగాణ మావోయిస్టు రహితంగా మారుతోందన్నారు. యుద్ధం కారణంగా ఇంధనం సంక్షోభం తలెత్తిందని అయితే కూడా బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించుకోవాలని అన్నారు. అలాగే మెట్రో సేవలను వాడుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించుకోవాలని అన్నారు.

అలాగే ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంక్షోభం కారణంగా ఏడాది పాటు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని ప్రధాని మోదీ హితవు పలికారు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలని దాంతోపాటు ఒక ఏడాదిపాటు బంగారం కొనుగోలు తగ్గించుకోవాలని పేర్కొన్నారు. వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచనలు చేశారు. విదేశాల నుంచి భారీగా రసాయన ఎరువులను దిగుమతి చేసుకుంటున్నామని ఎరువులను తగ్గించుకుంటే విదేశీ ద్రవ్యాన్ని మిగిలించుకోవచ్చని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధిస్తుందని.. బెంగాల్ లో గతంలో ఇద్దరు మాత్రమే బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేవారని ఇప్పుడు 200 మందికి పైగా ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు.












Click it and Unblock the Notifications