• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైఎస్‌ భలే చర్య

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Friday, September 24 2004

హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగంపై పట్టులేదన్న అభిప్రాయాన్ని పటాపంచలు చేసుకోడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి భలేరావును సస్పెండ్‌ చేశారు. భలేరావు సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు, మంత్రులు కోరినా వైఎస్‌ ఖాతరు చేయలేదు. ఇంకా చంద్రబాబు నాయుడి హ్యాంగోవర్‌లో ఉండవద్దని బ్యురాక్రసీకి ఒక సంకేతం పంపడానికే ఆయన ఈ కఠిన చర్య తీసుకున్నట్టు కన్పిస్తోంది. తన తొమ్మిదిన్నరేళ్ళ పరిపాలన కాలంలో చంద్రబాబు నాయుడు ఒక ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్ధాయి ఐఎఎస్‌ అధికారిని సస్పెండ్‌ చేయలేదు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలను అమలు చేయడంలో అధికార గణం అయిష్టత చూపుతోందన్న అభిప్రాయం వైఎస్‌ సలహాదారులకు ఉంది. కృష్ణా పుష్కరాల ప్రారంభం రోజున విధుల్లో నిర్లక్ష్యం ఆరోపణలపై కలెక్టరును, పోలీసు కమిషనర్‌ను నిముషాల వ్యవధిలో బదిలీ చేశారు. ఈ నాలుగు నెలల్లో మొదటి సారిగా వైఎస్‌ ఒక కఠిన నిర్ణయం తీసుకున్నది ఆరోజునే. భలేరావు సస్పెన్షన్‌తో ఆయన అధికార యంత్రాంగాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగారు. టిడిపి ప్రభుత్వం పోగానే ఐఎఎస్‌ అధికారులు రిలాక్స్‌ కావడమో, కొత్త ప్రభుత్వాన్ని లైట్‌గా తీసుకోవడమో జరుగుతోందన్న అభిప్రాయం ఉంది.

తమది గ్రామీణ ప్రజల ప్రభుత్వమన్న అభిప్రాయం ప్రజల్లో కలగాలంటే అందుకు తగినట్టు సీనియర్‌ అధికారులు మైండ్‌ సెట్‌ మార్చుకోవాలని కొత్త సిఎం కోరుకుంటున్నారు. కానీ ఆ మార్పు వారిలో కన్పించకపోవడం ఆయన కంటే ఆయన సలహాదారులకు ఆందోళన కలిగించింది. చంద్రబాబు నాయుడు పరిపాలనా శైలి భిన్నమైనది. ఆయన తనకు అనుకూలంగా ఉండే ఐఎఎస్‌ అధికారులందరికీ ముఖ్యమైన పోస్టులు ఇచ్చారు. మిగితా వారిని అప్రధాన శాఖలకు పరిమితం చేశారు. ఆయనంటే చాలా మంది ఐఎఎస్‌ అధికారులకు భయం, భక్తి ఉండేవి.

రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో ఐఎఎస్‌లది ఆడింది ఆట పాడింది పాటగా ఉండేది. ఇప్పుడు అలా జరగడానికి వీల్లేదన్న సంకేతాన్ని వైఎస్‌ పంపించారు.

ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్‌
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ
చిరు ఇంటికి బాంబు బూచి
కోనేరు హంపికి అర్జున్‌
మరోనెల నోటికి చెర!
తెలంగాణపై రిలే డిలే
మంచి సినిమా గతి ఇంతేనా?
మేటి ప్లేయర్‌ ద్రావిడ్‌
టాప్‌ స్లాట్‌పై కైఫ్‌ కన్ను
పారితోషికాలు తగ్గింపు?
వేడెక్కిన సిద్ధిపేట
గాంధీజీ చివరి అడుగులు
పనివాళ్ళ పనికాదు
పులిరాజా ఏమయ్యాడు?
చిత్ర హింస
కెసిఆర్‌ ఏం చేస్తున్నట్లు?
రాజకీయ రంగులు
చంద్రబాబు శైలి బాట
పరిటాల కథ హోంపేజిన్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X