• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మంచి సినిమా గతి ఇంతేనా?

By Staff
|
హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే Thursday, September 09 2004

;?

హైదరాబాద్‌: తెలుగులో ఆర్ట్‌ఫిల్మ్‌లుఅరుదు. ఆ టేస్ట్‌ మనవాళ్ళకు తక్కువ. ప్రఖ్యాత తెలుగురచయిత, ఫెమినిస్టు గుడిపాటి వెంకటాచలం కథదోషగుణంను గ్రహణంతో తెరకిక్కించారు. ఇది కేవలంఎనిమిది లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఆర్ట్‌ఫిల్మ్‌. టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌కుకూడా వెళ్ళిన ఈ సినిమా విడుదలకు నోచుకోకపోవడందురదృష్టకరం.

చలం నిజంగా జరిగిన సంఘటనలఆధారంగా ఈ కథ రాశారు. స్త్రీస్వేచ్ఛ కోసం ఎన్నో విప్లవాత్మకరచనలు చేసిన ఆనాటి తెలుగు సమాజంలో సంచలనం కలిగించిన చలం ఈకథలోనూ మహిళలకు సమాజంలో జరుగుతున్న అన్యాయాలనుకళ్ళకు కట్టారు.

ఈ సినిమాలో శారదాంబ (జయలలిత) నారాయణ స్వామి(తనికెళ్ళ భరణి) అనే భూస్వామి భార్య. ఆరోగ్యకరమైనపల్లెటూరు వాతావరణంలో ఆమె నడివయసుఅందాలు ప్రేక్షకులకు చక్కని సౌందర్యఅనుభూతిని కలిగిస్తాయి. ఆమె కనకయ్య అనే పేద విద్యార్ధిని ఆదరంగాచూస్తుంది. ఈ వారాలబ్బాయికి కొసరి కొసరి ఆప్యాయంగా అన్నంవడ్డిస్తుంది.

ఒక రోజు కనకయ్యజబ్బున పడతాడు. అతనికి వచ్చినజబ్బేమిటో ఇంగ్లీషు వైద్యులు కూడా కనుక్కోలేకపోతారు. పక్క వూరునాటు డాక్టరు వచ్చి అతడిని పరీక్షించి అది దోషగుణం అని చెబుతాడు.తనకంటే వయసులో పెద్ద అయిన మహిళతో సెక్స్‌లో పాల్గొంటేఇటువంటి వ్యాధి వస్తుందని చెబుతాడు.

ఈ జబ్బు తగ్గాలంటే కనకయ్యసెక్స్‌లో పాల్గొన్న మహిళ తొడ నుంచి తీసిన రక్తంతో కషాయం చేసితాగించాలని సూచిస్తాడు. కనకయ్య ఎవరితో సెక్సులో పాల్గొన్నాడో పెద్దలకుఅర్ధం కాదు. రాత్రి పూట కనకయ్య శారదాంబ పేరునుపలవరించడంతో భర్తతో సహా పెద్దలకు ఆమె శీలం మీద అనుమానంకలుగుతుంది.

ఈ దశలో సినిమా విపరీతమైనసస్పెన్స్‌గా సాగుతుంది. శారదాంబ తొడ రక్తం తీస్తారా? ఆమె శీలాన్నిశంకించిన భర్త హావభావాలు ఎలా ఉంటాయి. దశాబ్దాల తరబడి కాపురంచేసినా భార్యలను అనుమానించే భర్తలున్న మన సమాజాన్ని చలంచక్కగా విమర్శిస్తాడు.

ప్రముఖ కవి, పత్రికా రచయితఇంద్రగంటి శ్రీకాంత శర్మ కుమారుడు ఇంద్రగంటిమోహనకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.కనకయ్య శారదాంబ మీద సెక్స్‌ఆలోచనలు పెంచుకోవడం ఫ్రాయిడ్‌ సిద్ధాంతానికి దగ్గరగా ఉంది.

డిజిటల్‌ కెమెరాతో తీసిన ఈ సినిమా అక్కడక్కడ వూహల సన్నివేశాలుమినహా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో సాగుతుంది. ఇటువంటి సినిమాలనుఫిల్మ్‌ఛాంబర్‌ చొరవ తీసుకుని థియేటర్లలో విడుదల చేయవలసినఅవసరం ఉంది.

Recent Stories

మేటిప్లేయర్‌ ద్రావిడ్‌

టాప్‌స్లాట్‌పై కైఫ్‌ కన్ను

పారితోషికాలుతగ్గింపు?

వేడెక్కిన సిద్ధిపేట

గాంధీజీ చివరి అడుగులు

పనివాళ్ళ పనికాదు

పులిరాజాఏమయ్యాడు?

చిత్ర హింస

కెసిఆర్‌ఏం చేస్తున్నట్లు?

రాజకీయరంగులు

చంద్రబాబుశైలి బాట

పరిటాలకథ హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X