వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పారితోషికాలుతగ్గింపు?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Monday, September 06 2004

;?

హైదరాబాద్‌:సంక్షోభంలో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమనుగట్టెక్కించడానికి ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నడుం బిగించింది. సినిమాపరిశ్రమతోసంబంధం ఉన్నవారంతా తమ పారితోషికాలనుఇరవై శాతం మేరకు తగ్గించుకోలన్నతీర్మానాన్ని పరిశ్రమ పెద్దలు ఫిల్మ్‌ ఛాంబర్‌ముందు ఉంచారు. హీరోలు, హీరోయిన్లేకాక దర్శకులు, రచయితలు, ఇతరటెక్నీషియన్లు భారీగా పారితోషికాలు డిమాండ్‌చేయడంపై నిన్న జరిగిన సమావేశంలోనిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు.పరిస్ధితి ఇలాగే కొనసాగితే పరిశ్రమ మరింతసంక్షోభంలో పడిపోతుందని వారు అభిప్రాయపడ్డారు.పదేళ్ళ క్రితం ఏటా 180నుంచి 190సినిమాలు విడుదల అయ్యేవని

ఈసంఖ్య గత ఏడాది 95 కు పడిపోవడం దుస్ధితికినిదర్శనమని అన్నారు. చిరంజీవి, జూనియర్‌ఎన్టీఆర్‌, పవన్‌ కళ్యాణ్‌, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్‌ సినిమాకు నాలుగైదు కోట్లకుపైగా తీసుకుంటున్నారు. అయితే పెద్దహీరోలు ఎంత తీసుకున్నా తమకు అభ్యంతరంలేదని, పెద్ద స్టార్స్‌ చిత్రాలు నిర్మాతలకులాభాలను తెచ్చిపెడుతుంటాయని ఈ సమావేశంలోనిర్మాతలు అభిప్రాయపడ్డారు. ఒకటి రెండుసినిమాలతో పేరు తెచ్చుకున్న చిన్న స్టార్స్‌కూడా భారీ రెమ్యూనరేషన్లు డిమాండ్‌చేయడం పట్ల ఆందోళన వ్యక్తమైంది.

రాజమౌళి,కృష్ణవంశీ, పూరీ జగన్నాధ్‌, వి వినాయక్‌వంటి డైరెక్టర్లు కోటి నుంచి ఐదు కోట్లరూపాయలు డిమాండ్‌ చేస్తున్నట్టు నిర్మాతలుచెప్పారు. ఖర్చులు తగ్గితే తప్పసినిమా పరిశ్రమ మనుగడ సాగించలేదుఅని పాతికేళ్ళుగా సినిమాలు తీస్తున్న అశ్వనీదత్‌అభిప్రాయపడ్డారు. పెద్ద నటీనటులకుఅంత పారితోషికం ఇచ్చుకోలేనప్పుడువాళ్ళ గురించి ఆలోచించకపోవడం మంచిదిఅని మరో నిర్మాత స్రవంతి రవికిషోర్‌ అన్నారు.

మూడునెలలుగా వరుస ఫ్లాప్‌లను తెలుగుసినిమా పరిశ్రమ చవి చూడడంతో నిర్మాతలుమేధో మధన సదస్సు పెట్టుకుని ప్రధానసమస్యలపై కూలంకషంగా చర్చించారు.ప్రైవేటు టీవీ ఛానళ్ళు సినిమా సాఫ్ట్‌వేర్‌నుఇష్టమొచ్చినట్టు ఉపయోగించుకోవడం, సినిమాలకువెబ్‌సైట్లు ఇస్తున్న రేటింగ్స్‌ గురించి కూడాచర్చ జరిగింది.

Recent Stories
వేడెక్కిన సిద్ధిపేట
గాంధీజీ చివరి అడుగులు
పనివాళ్ళ పనికాదు
పులిరాజాఏమయ్యాడు?
చిత్ర హింస
కెసిఆర్‌ఏం చేస్తున్నట్లు?
రాజకీయరంగులు

చంద్రబాబుశైలి బాట
పరిటాలకథ హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X