కాంగ్రెస్‌హాస్యచిత్రం
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
కాంగ్రెస్ Saturday, May 01 2004
హైదరాబాద్: ఆలూ లేదు చూలు లేదు అల్లుడుపేరు సోమలింగం అన్నట్టున్న రాష్ట్రకాంగ్రెస్ నాయకుల వ్యవహారం ప్రజలకుఒక హాస్యచిత్రం చూస్తున్నట్టుగా ఉంది. పిసిసిఅనుమతి లేనిదే కాంగ్రెస్ నాయకులువిలేకరుల సమావేశాలు పెట్టకూడదనిహుకుం జారీ చేసి డి.శ్రీనివాస్ ఢిల్లీ వెళ్ళిపోయారు.ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నాననో,అధిష్టానం అడిగితే కాదనేది లేదనో ప్రకటించినవారి సంఖ్య అరడజనుకు పైగా ఉంది.
ఈరేసులో నెంబర్ వన్ స్ధానంలో ఉన్నవైఎస్ రాజశేఖరరెడ్డి ఇప్పుడు ఊటీలోమనవలతో కామిక్స్ పుస్తకాలు చదువుకుంటున్నారు.ఆయనకు ఆ పుస్తకాల కంటే రాష్ట్రకాంగ్రెస్ నాయకుల ప్రకటనలు ఎక్కువనవ్వు తెప్పించి ఉండవచ్చు. ముఖ్యమంత్రికావడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయనిఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి చాంతాడంతబయోడేటాను పత్రికలకు విడుదల చేశారు.సిఎం పదవికి రేసులో ఉన్నానని ప్రకటిస్తేకనీసం మంత్రి పదవి అయినా దక్కుతుందనిపురుషోత్తమరెడ్డి లాంటి వారి ఆలోచనకావచ్చు.
కాంగ్రెస్‌లోపెద్ద నాయకుడై కూర్చున్న దాసరి నారాయణరావుముఖ్యమంత్రి ఎంపికలో తన పాత్రఉంటుందని ప్రకటించారు. ఆయన మద్దతుకోరి డి.శ్రీనివాస్ ఆయన ఇంటికి వెళ్తేతననే సిఎంను చేయమని ఆ సినిమాపెద్దమనిషి అడగడం ఒక కామెడీ సన్నివేశంలాంటిదే. తన అనుకున్న నలుగురికిమంత్రిపదవులు బేరం చేసుకోడానికిదాసరి నారాయణ రావు రంగం సిద్ధంచేసుకున్నట్టు కన్పిస్తోంది.
ఇంతకీకాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ వస్తుందా?రాకపోతే ముఖ్యమంత్రి రేసులో ఉన్నామనిప్రకటించిన వాళ్ళు మొహాలు ఎక్కడ పెట్టుకోవాలి?కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల ముందు ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడి ఉంటే పార్టీ పరిస్ధితి దిగజారిఉండేదని రోశయ్యలాంటి పెద్దమనుషులుబాధపడుతున్నారు.
హోంపేజి











Click it and Unblock the Notifications