వైఎస్‌ పీఠం కదులుతోందా?

హైదరాబాద్‌:ఆసిఫ్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితం మనప్రజాస్వామ్య వ్యవస్ధపరిపక్వతకు నిదర్శనం.ఊసరవెల్లిలా పార్టీలు మార్చేవారికి ప్రజలుచెప్పిన గుణపాఠం. గత అసెంబ్లీఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ రాలేదనిరాత్రికి రాత్రి పార్టీ మారి పసుపు పచ్చ కండువాకప్పుకున్న దానం నాగేందర్‌ ఆఎన్నికలో నెగ్గాడు. కానీ టిడిపి కాకుండాకాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతోఆయన తెలుగుదేశంతో కాపురం చేయలేకపోయాడు.

కొత్తభార్య కంటేపాత భార్యే ఆయనకు ప్రేమమూర్తిగాకన్పించింది. వెంటనే శాసనసభ్యత్వానికిరాజీనామా చేసి ఆసిఫ్‌ నగర్‌ ఉపఎన్నికవచ్చేలా చేశాడు. కాంగ్రెస్‌ టికెట్‌ తెచ్చుకునిపోటీ చేసి పదకొండు వందల ఓట్ల తేడాతోఓడిపోయాడు. కొన్ని నెలల వ్యవధిలోనేఉప ఎన్నికకు కారణమై లక్షలాది రూపాయల ప్రజాధనం వృధా అయ్యేలాచేసిన నాగేందర్‌కు ప్రజలు గట్టిగాబుద్ధి చెప్పారు.

ఆసిఫ్‌నగర్‌ఉపఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని భావించినవైఎస్‌ వంటి నాయకులు ఈ ఎన్నిక ఫలితంతమ ప్రభుత్వంపై రిఫెరెండం వంటిదనిప్రకటనలు చేశారు. లేచిపోయి పొరుగింట్లోనేకొత్త కాపురం పెట్టిన వ్యక్తినిపెద్దమనసుతో మళ్ళీ దగ్గరకు తీసుకున్న కాంగ్రెస్‌నేతలకు ఈ ఎన్నిక కనువిప్పు కావాలి. ప్రజలను తక్కువగా అంచనావేయకూడదని వారు గ్రహించాలి. ఆసిఫ్‌నగర్‌ఉప ఎన్నిక తమ ప్రభుత్వ పనితీరుకురిఫరెండం అని ప్రకటించిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడేమంటారు?

ఇక్కడరాజకీయ నాయకులంతా తమ స్వార్ధంతాము చూసుకున్నారు. దానం నాగేందర్‌నుగెలిపించుకుని అతనికి మంత్రి పదవికట్టబెట్టి అదే కులానికి చెందిన డి. శ్రీనివాస్‌,హనుమంతరావు వంటి నాయకులకుచెక్‌ పెట్టాలన్నది వైఎస్‌వ్యూహం. ఆ ప్రయత్నం పెద్ద ఫ్లాప్‌ అయింది.ఒక అసెంబ్లీ ఉప ఎన్నికకు అధికార పార్టీపదిహేను మంది మంత్రులను ఇంచార్జులుగాపెట్టి డబ్బును ప్రవహింపజేసినా నాగేందర్‌నుఓడించడం ప్రజల కామన్‌సెన్సుకు నిదర్శనం.

అలాగని దీనిని ప్రభుత్వ వ్యతిరేకతగాచెప్పడానికి వీల్లేదు. దుస్తుల్లాగా పార్టీలనుమార్చే నాయకులకు గుణపాఠమిది. నాగేందర్‌ ఓడిపోయినందుకుతెలుగుదేశం నాయకులు చంకలుగుద్దుకోవడం కూడా సమంజసంకాదు. నాగేందర్‌ విషయంలో ఆనాడు చంద్రబాబునాయుడు చేసిన తప్పే ఈనాడురాజశేఖరరెడ్డి చేశారు. అనేకానేకవిషయాల్లో లాగే ఈ అంశంలోనూ కాంగ్రెస్‌,టిడిపిలు దొందూ దొందే.

పాపం,భారతీయుడు!
ఇద్దరుతల్లులు-ఇద్దరు కొడుకులు
నక్సల్స్‌ అప్‌బీట్‌
వీసాలపైఆశలు
వెయ్యికార్ల ర్యాలీ
ఈయనకు ఎక్సయిజ్‌ శాఖ కావాలట!
సెప్టెంబర్‌ పదకొండు వాస్తవాలు
అనంత ఎస్పీ అనుభవం
కెసిఆర్‌కు చివరకు మిగిలింది?
మనమే వీసాల వీరులం!
తెలుగుసినిమా దుస్ధితి
మేనేజర్‌గాగవాస్కర్‌
వైఎస్‌ భలే చర్య
ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్‌
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+