వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌సత్తాకు మిశ్రమ స్పందన

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే Friday, September 10 2004

న్యూఢిల్లీ: తమ్ముడు తమ్ముడే,పేకాట పేకాటే అన్న చందంగా ఉంది తెలంగాణపై కాంగ్రెస్‌అధిష్టానవర్గం ధోరణి. విదర్భతో పాటు తెలంగాణ రాష్ట్రంఏర్పడుతుందని, అయితే రెండో ఎస్సార్సీ సిఫార్సులు తప్పనిసరి అని ఇక్కడిఉన్నత స్ధాయి కాంగ్రెస్‌ వర్గాలు చెప్పాయి. తెలంగాణ విషయంపైసోనియాగాంధీ ఇటీవల కేంద్ర నేతలు అంబికాసోని, గులాంనబీ ఆజాద్‌లతోరెండు విడతలుగా చర్చించినట్టు తెలుస్తోంది.

తెలంగాణపై కాంగ్రెస్‌నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న విషయాన్ని చంద్రశేఖరరావుఅంబికాసోని ద్వారా సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్ళారు. దీనితోచికాకు పడిన ఆమె చర్చలు జరిపి సంయుక్త ప్రకటనచేయవలసిందిగా దిగ్విజయ్‌సింగ్‌ను ఆదేశించారు. తెలంగాణ పైసోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారు అని వారిద్దరూ ముక్తసరిగా సంయుక్తప్రకటన చేశారు.

ఏకాభిప్రాయం ద్వారానే తెలంగాణరాష్ట్రం ఏర్పాటవుతుందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇటీవలచెప్పారు. యుపిఎ భాగస్వాములందరూ తెలంగాణ రాష్ట్రంఏర్పాటుకు సుముఖంగా లేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఉభయకమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

రెండో రాష్ట్రాల పునర్విభజన సంఘంఏర్పాటైతే దాని సిఫార్సులు అందడానికి ఎన్నేళ్ళు పడుతుంది? ఈ సంఘంలోఏఏ పార్టీల వాళ్ళు సభ్యులుగా ఉంటారు? ఈ సంఘం పరిశీలనాంశాలు ఏమిటి? ఇవన్నీముఖ్యమైన అంశాలు. వచ్చే నెలలో మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఈవిషయంపై ఒక స్పష్టత ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ అంశాన్నిరెండో ఎస్సార్సీకి నివేదించాలని యుపిఎ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అదికర్ర విరగకుండా పాము చావకుండా అన్న సామెతలా ఉంటుందని, కాలహరణ చేస్తే వూరుకోమని టిఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు.

ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంఏర్పాటు అనివార్యమైతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన క్రెడిట్‌కాంగ్రెస్‌ పార్టీకే దక్కేలా చూసుకోవాలని, కెసిఆర్‌నునిమిత్తమాత్రుడిని చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు వ్యూహంపన్నుతున్నారు.

మరో వైపు తెలంగాణ మేధావుల్లో అధిక శాతంచంద్రశేఖరరావు తెచ్చే తెలంగాణ తో సమస్యలు తీరవన్నఅభిప్రాయంతో ఉన్నారు. ఆయన నాయకత్వంలో దొరల తెలంగాణఏర్పడుతుందే కానీ అణగారిన వర్గాల తెలంగాణ రాదని వీరివాదన. సోనియాగాంధీ పాదాలకు ప్రణమిల్లిన విధంగాచంద్రశేఖరరావు మాట్లాడడాన్ని వీరు ఆక్షేపిస్తున్నారు. తెలంగాణనుపోరాటం ద్వారా సాధించుకోవాలే గానీ అడుక్కోవడం ద్వారాసాధించుకోరాదని తెలంగాణ అతివాదుల అభిప్రాయం.

  • ప్రజాతెలంగాణే!
  • తెలంగాణ:కమ్యూనికేషన్‌ స్కిల్స్‌
  • తెలంగాణభాష కూడా తెలుగు భాషే
  • సాంస్కృతికచెర
  • నడిసంద్రంలోనావ టిఆర్‌యస్‌

  • ఉందిఒకేదారి!

  • రెండుతెలంగాణల ఘర్షణ

  • పస లేనిసమైక్యవాదం

    Recent Stories
    మంచి సినిమా గతి ఇంతేనా?
    మేటిప్లేయర్‌ ద్రావిడ్‌
    టాప్‌స్లాట్‌పై కైఫ్‌ కన్ను
    పారితోషికాలుతగ్గింపు?


    వేడెక్కిన సిద్ధిపేట
    గాంధీజీ చివరి అడుగులు
    పనివాళ్ళ పనికాదు
    పులిరాజాఏమయ్యాడు?
    చిత్ర హింస
    కెసిఆర్‌ఏం చేస్తున్నట్లు?
    రాజకీయరంగులు

    చంద్రబాబుశైలి బాట
    పరిటాలకథ హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X