వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కులం లెక్కలు ఎంత కరెక్టు?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Wednesday, May 26 2004

;?

హైదరాబాద్‌:ఒక కులానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవో మరో ముఖ్యమైనపదవో ఇచ్చినంతమాత్రాన ఆ కులానికి చెందిన వారంతా సదరుపార్టీకి విధేయంగా ఉంటారా? రాజకీయ పార్టీలన్నీ ఇదే ధోరణిలోఆలోచిస్తున్న నేపధ్యంలో ఈ అంశంపై సీరియస్‌గా చర్చించాల్సినఅవసరం ఉంది.

ఒక పార్టీ స్వభావాన్ని నిగ్గుతేల్చేవి ఆ పార్టీ విధానాలే.కులాల లెక్కలకు కూడా కొంత ప్రాధాన్యం ఉంటుంది కానీ అదే ఏకైకకొలమానం కాదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలోబలహీనవర్గాలకు బలమైనశాఖలు లభించాయి. ఈ విషయాన్ని వైఎస్‌ స్వయంగా చెప్పారు.బలహీనవర్గాల వారికి అసెంబ్లీ టికెట్లను సముచిత సంఖ్యలోఇవ్వనందున వారికి మంచిశాఖలు ఇవ్వడం ద్వారా కాంపెన్సేట్‌ చేశామనిఆయన చెప్పారు.

బిసి, ఎస్‌లకు కీలకమైన శాఖలను ఇచ్చినతెలుగుదేశం ప్రభుత్వానికి మొన్నటి ఎన్నికల్లో ఈ అంశంఅనుకూలంగా పరిణమించలేదు. హోంమంత్రిగా నెంబర్‌ టూస్ధానంలో దేవెందర్‌ గౌడ్‌ను ప్రొజెక్ట్‌ చేసినా అది ఆ కులం ఓట్లనుప్రభావితం చేయలేపోయింది.

గీత కార్మికుల సమస్యల మీద కంటేగౌడ్‌కు తన పదవే ముఖ్యమైందని ఆ వర్గం ప్రజలు భావించినట్టుకన్పిస్తోంది. అలాగే యాదవ కులానికి చెందిన యనమల రామకృష్ణుడినిర్వాకం అదే విధంగా ఉంది. వీళ్ళంతా పొలిటికల్‌ కెరీరిస్టులుగామారిపోయారన్న అభిప్రాయం ఆయా కులాల్లో ఉంది.

ఈ అనుభవాలను పరిగణనలోకితీసుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వం కుల సమీకరణాలకు ప్రాధాన్యంఇవ్వకుండా ఉండడం రాష్ట్ర విశాల ప్రయోజనాల రీత్యా అవసరం. ఏమంత్రికి సమాజంలోని కింది వర్గాలకు మేలు చేయాలన్న తపనఉందో వారిని ప్రోత్సహించాలి. అలాగే రాష్ట్రాభివృద్ధికి మంచి ఆలోచనలతోముందుకు వచ్చే యువతరం ఎమ్మెల్యేలకు పదవులు ఇస్తేరాష్ట్ర రాజకీయాల్లో ఆరోగ్యకరమైన మార్పులు వస్తాయి.

  • కాంగ్రెస్‌లో ఇది మామూలే!
  • వైఎస్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యి
  • ఎవరు గొప్ప?
  • ఆచితూచి అడుగులు
  • సవాళ్ళు ఎన్నో...
హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X