వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుల్లితెరచాటు...

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు Saturday, April 24 2004

హైదరాబాద్‌: రెండో విడత ఎన్నికలప్రచారం ముగిసిన శనివారం రోజు కోస్తా, రాయలసీమలలోతెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల ప్రచారం పతాకస్ధాయికి చేరింది.ఎన్నికల ట్రెండ్‌పై మీడియా కథనాలు, ఎన్నికల విశ్లేషణలుఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి.

రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందనిఎన్డీటీవీ ఒపీనియన్‌ పోల్‌లో బయట పెట్టగా ఇటీవల వరకుకాంగ్రెస్‌ జెండా మోసిన ఒక ఆంగ్ల పత్రిక మాత్రం రెండో దశలోటిడిపి పుంజుకుందని శనివారం తాటికాయంత అక్షరాలతోవార్తను ప్రచురించింది. దీనిని బలపరిచే కారణాలను ఆ పత్రికఉదహరించలేకపోయింది.

రకరకాల సమీకరణాలను,బలాబలాలను బేరీజు వేస్తే ఎన్నికల ఫలితాలు స్ధూలంగా రెండురకాలుగా ఉండవచ్చు. ప్రభుత్వం మారాలని కోరుకునే వారిశాతం ఎక్కువగా ఉంటే కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ వస్తుంది.తెలంగాణ, ఉత్తరాంధ్రలో తొలిదశ ఎన్నికలు ముగిశాకచంద్రబాబు నాయుడు ఆంధ్ర రైతులను కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌లకువ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో వాటి ప్రభావంఎలా ఉంటుందో విశ్లేషకులు అంతత్వరగా అంచనావేయలేకపోతున్నారు. ఆంధ్రావారిని దొంగలని తిడుతున్నచంద్రశేఖరరావుతో చేతులు కలిపిన కాంగ్రెస్‌నుఓడించమని ఆయన పిలుపు ఇచ్చారు. నీటిపారుదల ప్రాజెక్టుల గురించి ఏనాడూ మాట్లాడనిచంద్రబాబు నాయుడు రెండో విడత ప్రచారంలో దీనినే ప్రధానాంశంచేసుకున్నారు. ప్రజలు భావోద్వేగాలకు లోను కాకుండావిచక్షణను ఉపయోగిస్తే ప్రజల తీర్పు మరో రకంగా ఉండవచ్చు.

కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధినిముందే ప్రకటించి ఉంటే రెండు శాతం ఓట్లు కాంగ్రెస్‌కుపెరిగిఉండేవన్న అభిప్రాయం ఒకటి ఉంది. కానీ రాష్ట్రమంతటాప్రచారం చేసిన రాజశేఖరరెడ్డికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినందువల్లఆయనే ముఖ్యమంత్రి అభ్యర్ధి అన్న సంకేతం జనంలోకి వెళ్ళలేదనిఅనుకోలేం. మార్పు కావాలని ఓటర్లు ప్రబలంగా కోరుకుంటే ఇతరఅంశాలు పెద్ద ప్రభావం చూపబోవు.

ఒక విషయం మాత్రం స్పష్టంగాకన్పిస్తున్నది. తొంభై నాలుగు, తొంభై తొమ్మిది ఎన్నికల్లో వచ్చినట్టుతెలుగుదేశం ఘన విజయం సాధించడం ఇప్పుడు సాధ్యం కాదు.ప్రజలు మార్పు కోరుకుంటే , ప్రభుత్వవ్యతిరేకతఆరుశాతానికంటే ఎక్కువగా ఉంటే కాంగ్రెస్‌కు నూటఎనభైకంటే ఎక్కువ స్ధానాలు వచ్చే అవకాశం ఉంది. మార్పు కోరుకునేవారిశాతం అతితక్కువగా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి భారీమెజార్టీ రాకపోవచ్చు. టిడిపి, బిజెపి కూటమికి అత్తెసరుమెజార్టీయే వచ్చే అవకాశం ఉంది.

  • తారల ప్రభావం నిల్‌!
  • కెసిఆరే పెద్ద ఫ్యాక్టర్‌
  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X