• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సెప్టెంబర్‌పదకొండు వాస్తవాలు

By Staff
|
హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Saturday, October 02 2004

కాలిఫోర్నియానుంచి హిమబిందు

(దట్స్‌తెలుగు డాట్‌ కామ్‌ ప్రత్యేకం)

ఆధారాలుదొరకనంత వరకు ప్రతి ఘోరకలిఒక థియరీ మాత్రమే. అంటే, ఆ ప్రమాదంఎలాత సంభవించిఉంటుంది అనే ఆలోచనలు, విశ్లేషణల నుంచిపుట్టుకొచ్చే ఒక ఊహాచిత్రం.తెలియనిదేముంది.... ఊహలు రకరకాలు!కొంపతీసి అది సర్కారీ ఊహ అనుకోండి...కచ్చితంగా మోస్ట్‌ యాక్పెప్టబుల్‌థియరీ అవుతుంది. ఎందుకంటే తాముఎన్నుకున్న వ్యక్తులు గుండెలు తీసేబంటులని ప్రజలు అంత తొందరగాఅంగీకరించలేరు. కానీ ఎప్పుడయితే ఆఘటనకి సంబంధించిన ఆధారాలుదొరకడం ప్రారంభిస్తాయో, అవి థియరీకిభిన్నంగా అనిపిస్తాయో.... తొలుతహతాశులైనా... శోధనమొదలవుతుంది.... ప్రశ్నలుఉదయిస్తాయి.... కుట్ర ముసుగు తీసేసినిలుచున్నట్లనిపిస్తుంది. నిజం! అందరూకాకపోయినా కొంతమంది అమెరికన్స్‌సెప్టెంబర్‌ పదకొండు దాడుల గురించి ఇలాగేభావిస్తున్నారు.

ఈపరిణామక్రమానికి కారణం? ఊహలు చాలు...వాస్తవాలేవి? వాటి గురించి మాట్లాడరేమిటి?అంటూ వివిధ సంస్థలు, వ్యక్తులు సాగిస్తున్నవెతుకులాట. సెప్టెంబర్‌ పదకొండుదాడులకు ఇరాక్‌ కూడా సహకరించింది.అందుకు తగతిన ఆధారాలు మాదగ్గర ఉన్నాయి అంటూ భద్రతా విషయాలసలహాదారు కాండలీపా రైస్‌ ప్రభుత్వంతరఫున అప్పట్లో ప్రకటన ఇచ్చింది. దాడి జరిగిమూడేళ్లు నిండినా, ఇరాక్‌ నాశనంఅయినా కూడా అవేమిటో బయటపెట్టకపోవడాన్నిప్రజలు నేడు శంకిస్తున్నారు. ఆర్థికంగా,సైనికపరంగా అలాగే ప్రపంచదేశాలలో అమెరికా రెప్యుటేషన్‌తగ్గుతున్న నేపథ్యంలో ఇక్కడి ప్రజలునేడు వాస్తవాలపై దృష్టిసారిస్తున్నారు.

అందులోభాగమే నాకు తారసపడిన ఈడాక్యుమెంటరీ. వర్క్‌ ఎక్ప్‌పీరియన్స్‌లోభాగంగా నేను పని చేసే ఒక టెలివిజన్‌స్టేషన్‌లో ( ఇది ఫ్రీస్పీచ్‌ టెలివిజన్‌ స్టేషన్‌)సెప్టెంబర్‌ పదకొండు సంస్మరణసందర్భంగా "తొమ్మిది వందలపదకొండు ఇన్‌ ప్లేన్‌ సైట్‌ అనే అనేడాక్యుమెంటరీని ప్రసారం చేశారు.మెయిన్‌స్ట్రీమ్‌ ఛానల్స్‌ ప్రసారాలకిభిన్నమైన కాన్పెప్ట్‌తో ఉన్న ఈడాక్యుమెంటరీ వివరాల్లోకి వెళితే, డేవ్‌వాన్‌క్లయిస్ట్‌ అనే రేడియో వ్యాఖ్యాతదీనిని నిర్మించాడు. ది పవర్‌ అవర్‌డాట్‌కామ్‌ అనే వెబ్‌సైట్‌లో ఈడాక్యుమెంటరీ వివరాలు, అందుకు చెందినవాదోపవాదాలు ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీచూసిన తరువాత సెప్టెంబర్‌పదకొండు దాడుల గురించి మీ దృక్పథంమారుతుంది.... అనేది వీరి ప్లోగన్‌.

ఆరోజున ఏం జరిగింది?

సెప్టెంబర్‌పదకొండున గంటా పదిహేను నిమిషాలవ్యవధిలో నాలుగు విమానాలు ప్రమాదానికిగురయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలానలబై అయిదు నిమిషాలకి ( ఈస్టన్‌ టైమ్‌)అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిననెంబర్‌ పదకొండు విమానం వరల్డ్‌ట్రేడ్‌ సెంటర్‌ నార్త్‌ టవర్‌లోకిదూసుకుపోయింది. సరిగ్గా పద్దెనిమిది నిమిషాలతరువాత అంటే తొమ్మిది గంటలా మూడునిమిషాలకి యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కిచెందిన నెంబర్‌ నూటా డెబ్బై అయిదువిమానం సౌత్‌ టవర్‌ని ఢీ కొట్టింది. ఈరెండు ఘటనలు న్యూయార్క్‌లో జరిగితే,తొమ్మిది గంటలా నలబై మూడు నిమిషాలకి (ఈస్టన్‌ టైమ్‌) అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌విమానం నెంబర్‌ డెబ్బై ఏడువాషింగ్టన్‌లోని పెంటగాన్‌లోకిదూసుకుపోయింది. సరిగ్గా పది గంటలకుయునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిననెంబర్‌ తొంబై మూడు విమానంపెన్సల్వేనియా రాష్ట్రంలోని పొలాల్లోపడిపోయింది. ఇవి ప్రభుత్వం లేదా ప్రముఖమీడియా ఛానల్స్‌ అందించిన ఫ్లయిట్లవివరాలు.

పెంటగాన్‌లోకివిమానం దూసుకుపోవడం ఎక్కడైనాచూశారా?

సెప్టెంబర్‌పదకొండు దాడులు అనగానేసాధారణంగా గుర్తుకు వచ్చేదివరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లోకి విమానాలుదూసుకుపోయిన దృశ్యాలు. ఏ ఛానల్‌లోచూసినా ఇదే ఫుటేజ్‌. అయితేఇంతవరకు ఏ ఛానల్‌ అయినాపెంటగాన్‌లోకి విమానం ఎలాదూసుకుపోయింది అనే ఫుటేజ్‌ చూపించిందా?అసలు ఎవరైనా దీనిని చూశారా? పోనీ ఆ టైమ్‌లోటీవీ ఛానల్స్‌ వాళ్లు తమ కెమెరాలతోఅక్కడ సిద్ధంగా లేరని అనుకుందాం....ఆఖరికి గ్యాస్‌ స్టేషన్లలో కూడా కెమెరాలుఉండే అమెరికాలో అత్యంత పటిష్టమైనభద్రతా ఏర్పాట్లు ఉన్న పెంటగాన్‌లోకెమెరాలు లేవంటారా? అంటే మరి ఈఘటనని అవి ఎందుకు రికార్డ్‌చేయలేదు. చేసి ఉంటే ప్రజలుచూడటానికి వీలుగా ఎందుకు ప్రసారంచెయ్యలేదు? పెంటగాన్‌ భవనానికినష్టం జరిగిన దిశలో ఉన్న ఒక గ్యాస్‌స్టేషన్‌ కెమెరా ఫుటేజ్‌ని గంటలోపేసీక్రెట్‌ పోలీసులు తీసుకెళ్లారు.

భద్రతాకారణాలు చెప్పి, ఈ విషయంలో పెంటగాన్‌కిమరో అవకాశం ఇవ్వటానికిప్రయత్నిద్దాం. సరే ఆ విమానం ఏదోపెంటగాన్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోకిదూసుకుపోవడం రికార్డ్‌చెయ్యలేదు.. అనుకుందాం... మరి ఆసంఘటన జరిగిన తరువాత అయినా సరే,విమానం రెక్కలు, టైర్లు, సీట్లు,ప్రయాణికులు, లగేజ్‌, కాక్‌పిట్‌, ఇంజన్‌,వీటికి సంబంధించిన ఏదో ఒక ఆధారం లేదాఆనవాలు ఆ స్థలంలో కనిపించాలి కదా......?కనీసం ఆ ఛాయలతో ఉన్న ఫొటో లేదా వీడియోకవరేజ్‌ ఎక్కడైనా చూశారా?

ఇకలెక్కల్లోకి వెళదాం, ప్రమాదంకారణంగా పెంటగాన్‌లో కూలిపోయినభాగం పొడవు వెడల్పులు వరుసగాడెబ్బై మూడు అడుగులు, అరవై ఐదుఅడుగులు. పెంటగాన్‌లోకి దూసుకువెళ్లినట్లు చెప్పుతున్న విమానంముఖభాగం నుంచి తోక వరకు నూటాయాబై ఆరు అడుగుల మూడు అంగుళాలపొడవు. భూమి నలబై అడుగుల ఆరుఅంగుళాల ఎత్తు ఉంది. రెక్కల పైభాగంవెడల్పు నూటా ఇరవై నాలుగు అడుగల పదిఅంగుళాలు. నూటా ఇరవై నాలుగు అడుగులవెడల్పు (రెక్కల దగ్గర) ఉన్నవిమానం దూసుకువెళితే అరవైఅయిదు అడుగులకే ఎందుకు నష్టంజరిగినట్టు? మొదటి నుంచీ చివరి దాకా నూటాయాబై ఆరు అడుగులు ఉన్న విమానంవెనకభాగం అయినా కనిపించాలి కదా!ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే, విమానంపెంటగాన్‌లోకి దూసుకుపోగానే, అంటేఇంకా భవనంలోని ఆ భాగంపడిపోకముందు ఫొటోలు ఒకసారిచూసినట్టయితే కేవలం పదిహేను నుంచిపదహారు అడుగుల రంధ్రం మాత్రమేకనపడుతుంది. అంత పెద్ద విమానంచేసిన రంధ్రం అంతేనంటారా?(మిగతా భవనం అంతా కేవలంకాలిపోయి మాత్రమే ఉంటుంది. ఇందుకుఆధారాల్ని ఫొటోలో చూడవచ్చు)

అసలాపదిహేను, పదహారు అడుగులరంధ్రంలో అది ఎలా దూరింది? అంత పెద్దవిమానం దూసుకుపోయినా కూడాభవనం చాలా గంటల వరకు ఎలానిలబడింది అనేది మరో ప్రశ్న. అంత పెద్దవిమానం దూసుకుపోయినా కూడాభవనం చాలా గంటల వరకు ఎలానిలబడింది అనేది మరో ప్రశ్న. ఎందుకంటేవరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి జరిగినఘటనలో పెద్ద యెత్తున మంటలుచెలరేగటమే కాకుండా.... ఎక్కువ నష్టంజరిగింది. కానీ పెంటగాన్‌ విషయంలో అలాజరగలేదు. ఎందుకని? ఇక్కడఆలోచించాల్సిన మరో ముఖ్య విషయం,విమానం పెంటగాన్‌ తాకినప్పుడుసుమారు ఎనిమిది వేల ఆరు వందలు ( ఇదికాంటినెంటల్‌ ఫ్లయిట్‌) గాలన్లఇంథనం దాంట్లో ఉండి ఉంటుందని ఎన్విరాన్‌మెంటల్‌ అసెస్‌మెంట్‌అసోసియేషన్‌ (ఇఎఎ) ప్రతినిధి లెక్కలుకట్టారు. ఆ ఇంథనానికి పెంటగాన్‌మొత్తాన్ని పాన్‌కేక్‌లా (దిబ్బ రొట్టె షేప్‌లో)చేసెయ్యగల శక్తి ఉందని, కొన్ని రోజుల పాటుపెంటగాన్‌ మంటల్లో వుండటమేకాకుండా ఫెడరల్‌ నిబంధనలప్రకారం ఆ భూమి అంతా హెజార్డియస్‌వేస్ట్‌గా పరిగణించాల్సి వస్తుందని వారిఅంచనా. మరి అట్లా ఏం ప్రకటించలేదే?అసలంత ఇంథనం పడితే ఎంతోఎత్తున మటలు లేచి సర్వం కాలిపోవాల్సినపరిస్థితుల్లో కూడా మూడో అంతస్తులో ఉన్నకంప్యూటర్‌, ఫైల్‌ క్యాబినెట్‌ భేషుగ్గాఉన్నట్టు ఫొటోలు చెపుతున్నాయి.

సంఘటనాస్థలాన్ని ముందుగా చేరుకుని మంటలనుఆర్పే ప్రయత్నాల్ని చేసిన ఫైర్‌ ఫైటర్స్‌నిడాక్యుమెంటరీ నిర్వాహకులు కలవాలనిప్రయత్నించినప్పుడు... తొలుతఅంగీకరించినా... తీరా మాట్లాడాల్సిన సమయంవచ్చేసరికి వారు నిరవధిక సెలవులోవెళ్లిపోయారు.

ఇవన్నీసరే! పెంటగాన్‌ మీద విమానంపడకపోతే... ఎటు పోయింది లేదా ఎక్కడపడింది? అనే ప్రశ్నకి... బహుశా ఏసముద్రంలో అయినా ఉందేమో... లేదా ఆప్రశ్నని సిఎన్‌ఎన్‌, ఎబిసి, ఎన్‌బిసి ఛానల్స్‌వాళ్లని అడగండి... నేనింత వరకువిమానం పడిందని చెప్పనే లేదు అనిడేవ్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.ఆధారాల్ని బట్టి చూస్తే అదే బంకర్‌ బస్టర్‌కానీ, మిస్సయిల్‌ దాడి కానీ అయి వుంటుందనితమ టాక్‌ షోకి ఫోన్‌ చేసిన వార్‌వెటరన్స్‌ అంటున్నారని డావ్‌ చెప్పాడు.

న్యూయార్క్‌వివరాలు

ఇకన్యూయార్క్‌ వివరాలకి వద్దాం. సౌత్‌టవర్‌ని తాకిన విమానం అడుగునమిస్సయిల్‌ లాంటిది ఏదో ఎటాచ్‌ చేసి ఉన్నట్టుఫొటో ఆధారంగా ఈ డాక్యుమెంటరీలోచూపించారు. ఈ విషయంలో ఇంక ఆమైనాసందేహాలు ఉంటే లెట్స్‌రోల్‌ 911డాట్‌కామ్‌లోకి వెళ్లి చూడొచ్చు.

ఇక్కడవెలుగులోకి రాని అంశం మరోటి ఉంది.సౌట్‌ టవర్‌, నార్ట్‌ టవర్‌లని విమానాలుఢీకొన్న తర్వాత, అంటే అవి ఇంకాపడిపోక ముందు జరిగిన సంఘటన ఇది.భవనాల నుంచి వస్తున్న పొగకెమెరాకి ఎదురుగా అంటే సౌత్‌ ఈస్ట్‌దిశలో వెళ్తుంటే, కింది నుంచి (గ్రౌండ్‌నుంచి) ఇంచుమించు అదే స్థాయిలో పొగ(నార్త్‌ వెస్ట్‌ వైపుకి పోతుంది) పైకివ్యాపిస్తున్న ఫుటేజ్‌ ఒకటి సి ఎన్‌ ఎన్‌లోప్రసారం చేశారు. చిత్రంగా కేవలంఒక్కసారి మాత్రమే ఈ ఫుటేజ్‌నుచూపించడం జరిగింది.... ప్రమాదానికిగురైన భవనాల నుంచి కాకుండాగ్రౌండ్‌ నుంచి పొగ ఎలా, ఎక్కడి నుంచివస్తోంది... అనే అంశాన్ని ఏ ఛానల్‌ కూడాస్పృశించకపోవడం అనుమానాస్పదం.కానీ గ్రౌండ్‌లో పని చేసిన ఫైర్‌ వర్కర్స్‌(వాస్తవంగా చెప్పాలంటే ప్రత్యక్షసాక్షులు) కొందరు మాత్రం భవనాల్లోపెద్ద పెద్ద పేలుళ్లు సంభవించాయనిచెప్పుతున్నారు. మరి ఈ శబ్దాలపై నోరుమెదపడానికి ఏ ప్రభుత్వ యంత్రాంగంసిద్ధంగా లేదు. సౌత్‌ నార్త్‌ టవర్‌లువాటంతట అవే కూలిపోగా, ఏడవ నెంబర్‌భవనాన్ని మాత్రం కంట్రోల్డ్‌డెమాలిషన్‌ చేశామని ప్రభుత్వంప్రకటించింది. ఏ మాత్రం ఊహించనివిధంగా దాడి జరిగిన ఘటనలో ఎనిమిదిగంటల్లోపే ఈ నలబై రెండు అంతస్థులభవన డెమాలిషన్‌ని నిర్వహించడంఎలా సాధ్యమైంది? అనేది ఊహకందనిప్రశ్న.

దాడిలోపాల్గొన్న ఈ రెండవ విమానం మిలటరీవిమానం అని, అందుకు ప్రత్యక్షసాక్ష్యంగా వివిధ ఛానల్స్‌లో వచ్చినఫుటేజ్‌ని డాక్యుమెంటరీలో చూపించారు. దాడిజరిగిన సమయంలో జరిగిన ప్రత్యక్షప్రసారాల్లో కొంత మంది జర్నలిస్టులుతొలుత ఈ విధంగానే స్పందించారు.అయితే తరువాత ఆ వివరాలనుప్రభుత్వ సమాచారాన్ని అనుసరించిమార్చారు.

ఇటువంటిఇంకా అనేక సున్నితాంశాల్ని, ఇంత వరకువెలుగులోకి రాని సందేహాలని డాక్యుమెంటరీప్రస్తావించింది.

చివరగాఈ డాక్యుమెంటరీ రచయిత, వ్యాఖ్యాతమాట్లాడుతూ పెంటగాన్‌పై జరిగినదాడిలో వాస్తవాలు దాచెయ్యాలని చూడటంస్పష్టం. కచ్చితంగా ఇందులో ఎవరో ఒకబలమైన వ్యక్తి గానీ, సంస్థకి కానీప్రమేయం ఉండే ఉంటుంది. అయితే ఈ నాలుగువిమాన ప్రమాదాలు చాలా దగ్గరవ్యవధిలో జరిగాయి. పైగా అన్నీ విమానదాడులే దాంతో ఒకటి చేసిన వాళ్లకిమిగతా మూడింటితో సంబంధం ఉండేఅవకాశాలే ఎక్కువ. ఒకదానికిసంబంధించిన వివరాల్ని దాస్తున్నారంటేమిగతా మూడింటి వివరాల్ని కూడా అంతోఇంతో కప్పెట్టేసుంటారనుకోవడం, అలాగేసంబంధం ఉందనుకోవడంలోతర్కవిరుద్ధం ఏమీ కాదు. ఆధారాలులేకపోతే కుట్ర కానీ, ఇన్నికనపడుతుంటే.... వాస్తవానికిదగ్గరలోనే ఉన్నట్టనిపిస్తోంది. ఏది ఏమైనాఆధారాలను ప్రజల ముందు ఉంచాలనేదే మాప్రయత్నం.... నీటి నుంచి ప్రజలు ఎలాంటిముగింపుని స్వీకరిస్తారనేది వారి ఇష్టం అనితేల్చాడు.

ఈఅంశానికి సంబంధించిన మరిన్ని వివరాలుతెలియాలంటే, ఈ కింది వెబ్‌సైట్లలో ఉన్నాయి.ఒక వేళ ఈ డాక్యుమెంటరీచూడదలుచుకుంటే ది పవర్‌అవర్‌ డాట్‌కామ్‌ ద్వారా ఆర్డర్‌చేసుకోవచ్చు. అన్నట్టు ఈ అంశంపైఇన్వెస్టిగేట్‌ చేయాలన్న ఐడియా ఫ్రెంచ్‌దేశస్థులు తయారు చేసినహంట్‌ ది బోయింగ్‌ డాట్‌కామ్‌నిచూసిన తరువాతే వచ్చిందట.

ఆనాటిదుర్ఘటనను కళ్ళకు కట్టే ఫోటోలనురైటప్‌లతో సహా ఇక్కడ చూడండి

http://thatstelugu.oneindia.com/talk2004/general/sept11_1.html

http://www.thepowerhour.com

అనంత ఎస్పీ అనుభవం

కెసిఆర్‌కు చివరకు మిగిలింది?

మనమే వీసాల వీరులం!

తెలుగుసినిమా దుస్ధితి

మేనేజర్‌గాగవాస్కర్‌

వైఎస్‌ భలే చర్య

ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్‌
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ
చిరు ఇంటికి బాంబు బూచి
కోనేరు హంపికి అర్జున్‌
మరోనెల నోటికి చెర!
తెలంగాణపై రిలే డిలే
మంచి సినిమా గతి ఇంతేనా?
మేటి ప్లేయర్‌ ద్రావిడ్‌
టాప్‌ స్లాట్‌పై కైఫ్‌ కన్ను హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more