తెలుగు సినిమాదుస్ధితి

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Monday, September 27 2004

హైదరాబాద్‌:తెలుగు సినిమా పరిశ్రమమునుపెన్నడూ లేనంతసంక్షోభంలో చిక్కుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఎన భై అయిదు సినిమాలువిడుదల కాగా వాటిలో ఆరు మాత్రమేలాభాలను ఆర్జించాయంటే మొత్తంగాపరిశ్రమ ఏ స్ధితిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు. ఈ పరిస్ధితికిహీరోహీరోయిన్ల పారితోషికాలు బాగాపెరగడమే కారణమని నిర్మాతలమండలి అభిప్రాయపడుతోంది. తారలఅధిక పారితోషికాలు ఒక కారణమే గానీసంక్షోభానికి ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి.ముఖ్యంగా కథల ఎంపిక సరిగా ఉండడంలేదు.

అచ్చమైన తెలుగు కథల మీదనమ్మకం లేక ఇతర దక్షిణాదిభాషల్లో హిట్‌ అయిన సినిమాలను రీమేక్‌చేయడం వల్ల వాటిలో తెలుగు ఆత్మకొరవడి ఆ సినిమాలు ప్రేక్షకులహృదయాలనుతాకలేకపోతున్నాయి. ఇన్ని కబుర్లుచెబుతున్న నిర్మాతలు తెలుగుసినిమా కథ మీద ఒక సీరియస్‌వర్క్‌షాప్‌ ఎందుకు పెట్టరు? అలాగేపరిశ్రమకు దీర్ఘకాలంలోఉపయోగపడే చర్యలు ఎందుకుతీసుకోరు?.

గతంలోమొత్తం సినిమా వ్యయంలోనటీనటుల, టెక్నీషియన్లపారితోషికాలు మూడో వంతుకు మించేవికావని, ఇప్పుడు డెబ్బై శాతం ఖర్చు వీరికేపోతున్నదని నిర్మాతల మండలిఅధ్యక్షుడు డి. సురేష్‌ అన్నారు.మల్లీశ్వరి సినిమాకు కత్రినా కైఫ్‌ కోటిరూపాయల పారితోషికం తీసుకోవడంపైఇప్పటికీ ఇండ్రస్టీలో చర్చ జరుగుతోంది.

త్వరలోవిడుదల కానున్న చిరంజీవి చిత్రంశంకర్‌ దాదా ఎంబిబిఎస్‌ మీద తెలుగుసినిమా పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది.చిన్న సినిమాలు ఎన్ని హిట్‌ అయినా రాని ఒకఉత్తేజం ఒక భారీ సినిమా హిట్‌ అయితేవస్తుంది. పరిశ్రమ మీదఆధారపడిన వేలాది కుటుంబాలకు అదినిజమైన పండుగగా ఉంటుంది. గతమూడేళ్ళుగా నూట యాభై సినిమాలుసగంలో నిలిచిపోవడమో, విడుదలకునోచుకోకపోవడమో జరిగింది.దేశంలోహిందీ తర్వాత అతి పెద్దదైనతెలుగు సినిమా పరిశ్రమ సంక్షోభంనుంచి గట్టెక్కితే కానీ వేలాది సినిమాకుటుంబాల్లో వెలుగు నిండదు. కోట్లాదితెలుగు ప్రేక్షకులకు ఆనందంకలుగదు.

మేనేజర్‌గాగవాస్కర్‌
వైఎస్‌ భలే చర్య
ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్‌
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ
చిరు ఇంటికి బాంబు బూచి
కోనేరు హంపికి అర్జున్‌
మరోనెల నోటికి చెర!
తెలంగాణపై రిలే డిలే
మంచి సినిమా గతి ఇంతేనా?
మేటి ప్లేయర్‌ ద్రావిడ్‌
టాప్‌ స్లాట్‌పై కైఫ్‌ కన్ను హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+