వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పటికిప్పుడుచెరిసగం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు Monday, April 12 2004

హైదరాబాద్‌:తెలుగుదేశం, కాంగ్రెస్‌ల మధ్య ఈ దశలోరెండు శాతం తేడా ఉందని ప్రముఖ ఎన్నికలవిశ్లేషకుడు యోగేంద్ర యాదవ్‌ అభిప్రాయం.టిఆర్‌ఎస్‌కు అనవసరంగా ఎక్కువ సీట్లుకేటాయించామన్న అభిప్రాయం కాంగ్రెసు అధినాయకత్వంలోబలపడుతోంది. అదే సమయంలో తిరుగుబాట్లబెడద వల్ల కనీసం ఆరు స్ధానాలు పోగొట్టుకోవాల్సినపరిస్ధితి ఏర్పడిందని తెలుగుదేశంనాయకత్వం భావిస్తోంది. బిజెపి-టిడిపి,కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కూటమికి చెరిసగంసీట్లు వచ్చి హంగ్‌ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలనుకూడా నిపుణులు కొటివేయడం లేదు.

రాజశేఖరరెడ్డిజైత్రయాత్రకు మంచి స్పందన ఉండడంతోఇంటిలిజెన్స్‌ అధికారులు గంటకో నివేదికనుప్రభుత్వానికి సమర్పిస్తున్నారు. ఇప్పటికిప్పుడుకాంగ్రెసు పార్టీని ఉత్తేజపరిచే విషయం ఏదైనాఉంటే రాజశేఖరరెడ్డి జైత్రయాత్రమాత్రమే. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళనుంచి ఖమ్మం జిల్లా వరకు మండుటెండల్లోసాగిన రాజశేఖరరెడ్డి రోడ్డు యాత్ర ఈమధ్యకాలంలో చెప్పుకోదగినది. చంద్రబాబు నాయుడుహైటెక్‌ స్టయిల్లో హెలికాప్టర్‌లో ప్రచారంసాగిస్తుండగా రాజశేఖరరెడ్డి నిరాడంబరంగాజనంలో తిరుగుతున్నారు. ఇవే మనసమరానికి ఆఖరు ఎన్నికలని ఆయన కార్యకర్తలకుతెగేసిచెబుతున్నారు.

రాజశేఖరరెడ్డిమీద జనంలో సానుభూతి ఉన్నప్పటికీకాంగ్రెస్‌ పార్టీ వ్యవహారశైలి తెలుగుప్రజలకుఅంతగా నచ్చినట్టు కన్పించదు. కాశ్మీరునేత గులాంనబీ ఆజాద్‌, మలయాళ మాంత్రికుడువాయలార్‌ రవి మన నాయకుల మీద చేస్తున్నబాసిజం తెలుగు ప్రజలకు ఆత్మాభిమానాన్ని మరోసారిగుర్తుచేసింది. కాంగ్రెసు పార్టీ ఎవరో ఒకరినిముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి స్వేచ్ఛఇస్తే బాగుండేది.

చంద్రబాబునాయుడికి మహిళలు ప్రధాన ఓటు బ్యాంకు.మహిళలను ఆకర్షించడానికి కాంగ్రెస్‌కొత్తగా ఏ ప్రయత్నమూ చేస్తున్నట్టు కన్పించడంలేదు. ప్రభుత్వ ఉద్యోగులు తెలుగుదేశంపార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రైవేటైజేషనుభయంతో ప్రభుత్వరంగ సంస్ధల ఉద్యోగులుబిజెపి-టిడిపి కూటమిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈసారిఎన్నికల్లో ప్రభుత్వ అనుకూలత గానీవ్యతిరేకత కానీ కన్పించడం లేదు.ఓటరు నిశ్శబ్దంగా ఉన్నాడు. పత్రికలు చదవని,టీవీలు చూడని ఓటరు మహాశయుల తీర్పు ఎటుఉంటే అటే మొగ్గు. కన్పించలేదు. కాంగ్రెసు ఒక విలక్షత ఉందంటే ఇటువంటిదే.

  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X