వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందుందివిస్తరణం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 13-10-2005

Dissidence may emerge after cabinet expansionహైదరాబాద్‌:ఇప్పటి వరకు ఏకఛత్రాధిపత్యంగాసాగిన వైఎస్‌ పాలనకు మంత్రివర్గ విస్తరణ అనంతరంచిక్కులుఎదురుకానున్నాయి. దాదాపు నలభైమందిఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఈనెల 17నఆయన సోనియాగాంధీని కలిసినప్పుడుమిగితా అంశాలతో పాటు మంత్రివర్గ విస్తరణపైకూడా చర్చిస్తారు. నలుగురు మంత్రులకు ఉద్వాసన పలికి, తొమ్మిదిమందికి అవకాశం కల్పించవచ్చు.ఇప్పటి మంత్రులలో అనేక మంది శాఖలు మారే అవకాశముంది. సహకారఎన్నికల ప్రక్రియ ఈ నెలాఖరుతో ముగుస్తున్నందువల్ల,నవంబర్‌మొదటి వారంలో మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలున్నాయి.

మంత్రిపదవుల కోసం నలభైమంది చకోరపక్షుల్లా ఎదురు చూస్తుండగా, తొమ్మిదిమందికి మాత్రమే అవకాశం కల్పిస్తే,మిగిలిన వారు అసమ్మతి శిబిరంనడుపుతారన్న సత్యం వైఎస్‌కుతెలియనిది కాదు. అసమ్మతి రాజకీయాల్లోఆయనకు ఉన్నంత అనుభవం మరేనాయకుడికీ లేదు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒకముఖ్యమంత్రికి ఎసరుపెట్టాలంటే అధిష్టానవర్గం వద్ద ఏం చేయాలో వైఎస్‌కు తెలుసు. ఆఅనుభవంతో ఆయన తన పార్టీ వారుఎసరు పెట్టకుండా ముందు జాగ్రత్త చర్యలుతీసుకుంటున్నారు. మంత్రి పదవులనుఆశిస్తున్న వారి వివరాలు జిల్లాలవారీగా ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌నుంచి ముఖేష్‌కు మంత్రి పదవి దక్కవచ్చు. రంగారెడ్డిజిల్లానుంచిఎవరికీ అవకాశం ఉండదు. శ్రీకాకుళంజిల్లాలో ప్రస్తుతం ధర్మానప్రసాదరావు మంత్రిగా ఉండగా,హనుమంతు అయ్యప్పదొర, కొండ్రుమురళి, నరేశ్‌ కుమార్‌ అగర్వాల్‌మంత్రి పదవులను ఆశిస్తున్నారు.విజయనగరం జిల్లాలో శత్రుచర్లవిజయరామరాజును మంత్రివర్గం నుంచితొలగిస్తారని వినిపిస్తోంది. అయితే తీవ్ర అవినీతిఆరోపణలు ఉన్న బొత్స సత్యనారాయణఅలాగే ఉంచి, శత్రుచర్లను తొలగించడంవ్యతిరేకతకు దారి తీయవచ్చన్నఅభిప్రాయమూ ఉంది. విజయనగరం జిల్లా నుంచి పి సాంబశివరాజుమంత్రి పదవిని ఆశిస్తున్నారు. విశాఖపట్నం జిల్లానుంచి ద్రోణంరాజు సత్యనారాయణ మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్నారు. బ్రాహ్మణకులం నుంచి ఒక్కరు కూడా మంత్రిగాలేనందువల్ల ద్రోణంరాజుకుఅవకాశాలున్నాయి. ఈ జిలా నుంచి గండి బాబ్జీ,గురుమూర్తి రెడ్డి కూడా మంత్రిపదవులను ఆశిస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లా మంత్రి అయినగొల్లపల్లి సూర్యారావును తొలగించి, చిట్టూరిరవీంద్ర, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లలోఒకరికి పదవి దక్కవచ్చు.పశ్చిమగోదావరి జిల్లాకు మంత్రివర్గంలోస్ధానం లేదు. వట్టివసంతకుమార్‌కు మంత్రి పదవి దక్కవచ్చు.మాగంటివెంకటేశ్వరరావు, పితానిసత్యనారాయణ కూడా మంత్రి పదవులనుఆశిస్తున్నారు.

కృష్ణా జిల్లాలోఇద్దరు మంత్రులను కొనసాగిస్తూనేమరొకరికి అవకాశం కల్పించవచ్చు. చనుమోలు వెంకటరావు,మండలిబుద్ధప్రసాద్‌, బూరగడ్డ వేదవ్యాస్‌,ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను కూడామంత్రి పదవులను ఆశిస్తున్నారు. గుంటూరు జిల్లానుంచి గాదె వెంకటరెడ్డి, గుదిబండి వెంకటరెడ్డి, వెంకటరమణ మంత్రి పదవులను ఆశిస్తున్నారు. తనకుమారుడునాందెండ్ల మనోహర్‌కు మంత్రిపదవి ఇప్పించుకోడానికి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్లుభాస్కరరావు ఢిల్లీ స్ధాయిలోప్రయత్నిస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచిదగ్గుబాటి వెంకటేశ్వరరావుకుమంత్రి పదవి లభించవచ్చు. నెల్లూరుజిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డిమంత్రి పదవి ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు. చిత్తూరు జిల్లాలోమంత్రి పదవుల కోసం పోటీపడుతున్నవారి సంఖ్య అధికంగా ఉంది. గాలిముద్దు కృష్ణమనాయుడు, గల్లాఅరుణ, చీఫ్‌విప్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డి,ఆర్‌ చెంగారెడ్డి, పీలేరురామచంద్రారెడ్డి, జి కుతూహలమ్మ తీవ్రంగా పోటీపడుతున్నారు. కర్నూలుజిల్లాకు సంబంధించి మంత్రి మారెప్పనుతొలగించవచ్చు. ఇ.ప్రతాప్‌ రెడ్డి,కె.రాంభూపాల్‌ రెడ్డి, చల్లారామకృష్ణారెడ్డి మంత్రి పదవులనుఆశిస్తున్నా వీరిలో ఎవరికీ పదవి దక్కకపోవచ్చు. కడప,అనంతపురం జిల్లాల నుంచి విస్తరణలోఎవరికీ అవకాశం ఉండదు.

మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి జి. చిన్నారెడ్డి,శంకర్‌రావు, గురునాథ్‌ రెడ్డి మంత్రిపదవులను ఆశిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఉప్పునూతలపురుషోత్తం రెడ్డి, కోమటిరెడ్డివెంకటరెడ్డి, ఆర్‌ దామోదర్‌ రెడ్డి మంత్రి పదవిపైఆశలు పెట్టుకున్నారు. ఈ జిల్లాకు చెందిన హోంమంత్రి జానారెడ్డి శాఖ మార్పును కోరుకుంటున్నారు. మెదక్‌జిల్లా మంత్రి ఫరీదుద్దీన్‌ను తొలగిస్తే, సునీతా లక్ష్మారెడ్డికి అవకాశందక్కుతుంది. ఖమ్మం జిల్లాలో కూడా మంత్రిపదవులను ఆశిస్తున్న వారి సంఖ్యఎక్కువగా ఉంది. వనమావెంకటేశ్వరరావు, సంభాని చంద్రశేఖర్‌, ఆర్‌ వెంకటరెడ్డిమంత్రిపదవులపై తీవ్ర ఆశలు పెట్టుకున్నారు. చివరికి డార్క్‌ హార్స్‌ జలగం వెంకట్రావుకుపదవి దక్కే అవకాశం లేదు.కరీంనగర్‌ జిల్లా నుంచి టి జీవన్‌రెడ్డి,ప్రభుత్వ విప్‌ శ్రీధర్‌బాబుల్లో ఒకరికిపదవి దక్కనుంది. ద్రోణం రాజుసత్యనారాయణకు మంత్రి పదవి లభిస్తేఅదే బ్రాహ్మణ వర్గానికి చెందిన శ్రీధర్‌బాబుకు అవకాశంఉండకపోవచ్చు. వరంగల్‌, నిజామాబాద్‌జిల్లాలకు విస్తరణలోఅవకాశముండదు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచిఎ. ఇంద్రకరణ్‌ రెడ్డి.సి.రామచంద్రారెడ్డి మంత్రి పదవులనుఆశిస్తున్నారు.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X