వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్‌ప్లస్‌ మైనస్‌లు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 29-09-2005

హైదరాబాద్‌:నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణమేప్రధాన నినాదంగా పురోగమిస్తున్న వైఎస్‌రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి మునిసిపల్‌ఎన్నికల ఫలితాలు సంబరం కలిగించాయి.ఓవరాక్షన్‌ చేస్తున్న సీనియర్‌ పోలీసుఅధికారులను ప్రాధాన్యం లేని పోస్టులకుబదిలీ చేయడం ద్వారా అడ్మిన్రిస్టేషన్‌ మీదకూడా గట్టి పట్టు సాధించుకున్నట్టు వైఎస్‌నిరూపించుకున్నారు. అయితే ఇల్లుఅలకగానే పండగ కాదు. ముందుముసళ్ళ పండగలు ఉండవని గ్యారంటీగాచెప్పడం సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడి మీద ఇంకా వ్యతిరేకతపోకపోవడం, చంద్రశేఖరరావు మీదతెలంగాణ ప్రజలకు అపనమ్మకంకలగడం వల్ల కాంగ్రెస్‌ మునిసిపల్‌ఎన్నికలలో ఘనవిజయం సాధించగలిగింది. దీనినిపూర్తిగా పాజిటివ్‌ ఓటుగా అధికార పార్టీపరిగణించాల్సిన అవసరం లేదు.

అధికార కాంగ్రెస్‌పార్టీ ఇప్పుడు కొత్త అంకంలోకి ప్రవేశించింది.చంద్రబాబును, చంద్రశేఖరరావునుచిత్తు చేసినందుకు అధిష్టానవర్గంవద్ద వైఎస్‌ పలుకుబడి మరింత పెరిగింది.ఇప్పట్లో ఆయన మీద అసమ్మతి క్యాంపులునడిపే ధైర్యం ఏ కాంగ్రెస్‌ నాయకుడికీలేదు. త్వరలో వైఎస్‌ మంత్రి వర్గాన్నిపునర్వ్యవస్ధీకరించనున్నారు.అనేక ముఖ్యమైన శాఖలు ముఖ్యమంత్రివద్దనే ఉండడం వల్ల పరిపాలనాపరమైన ఇబ్బందులుతలెత్తుతున్నాయి. ఈ సంవత్సరంపుష్కలంగా పడడం వైఎస్‌కు పెద్ద ఊరట. సర్వాధికారాలు గలముగ్గురు ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్‌చేరిపోయారు. మొదటి ఇద్దరు ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో ఏకాంగ్రెస్‌ ముఖ్యమంత్రీ వైఎస్‌ అంతపవర్‌ వెలగబెట్టలేదు.

అయితేమంత్రివర్గ విస్తరణ అనంతరంకొందరుసీనియర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుఒక్కటయ్యే అవకాశాలు లేకపోలేదు.కొందరు కాంగ్రెస్‌ నాయకులేప్రభుత్వ రహస్యాలను ప్రతిపక్షాలకు చేరవేయవచ్చు. కాంగ్రెస్‌ అసమ్మతికళలో ఇటువంటి నిర్వాకాలు ఒక భాగం. వచ్చేమూడేళ్ళలో కాంగ్రెస్‌ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోలేక పోతేప్రజల్లోనే వ్యతిరేకత వస్తుంది.ముఖ్యమంత్రులను మార్చే కాంగ్రెస్‌కల్చర్‌లో ఇప్పుడు మార్పు రావడంవైఎస్‌ నెత్తిన పాలు పోసింది. వైఎస్‌ప్రభుత్వానికి ఉన్న పెద్ద గండం అవినీతి.వచ్చే మూడేళ్ళలో రెండు మూడుపెద్ద కుంభకోణాలు బయటపడినాప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X