వర్మ-అనిల్ అంబానీకాంబినేషన్
హైదరాబాద్:రామ్‌గోపాల్ వర్మ-రిలయెన్స్‌అధినేత అనిల్ అంబానీ సంయుక్తంగాహిందీ, తెలుగు, తమిళ చిత్రాలు నిర్మించనున్నారు.దీనికి సంబంధించినమొమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్‌పై ఉభయులూ సంతకాలు చేశారు. అన్న ముఖేష్ అంబానీనుంచి విడిపోయాక అనిల్ అంబానీ మీడియా,ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన ఇప్పటికేముంబాయిలోని పోస్ట్ ప్రొడక్షన్ సూట్‌ప్రైమ్ ఫోకస్‌లోను, యాడ్‌లాబ్స్‌లోనూ మేజర్ స్టేక్ తీసుకున్నారు.యాడ్ లాబ్స్‌లోని చిత్రనిర్మాణ విభాగంఎంటర్‌టైన్‌మెంట్ వన్ రామ్‌గోపాల్‌వర్మతో హిందీ, తెలుగు, తమిళ చిత్రాలునిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకుంది.2006 సంవత్సరాంతానికి 12 హిందీ, 5తెలుగు, 5 తమిళ చిత్రాలను వీరుఉభయులూ సంయుక్తంగా నిర్మించనున్నారు.
రాంగోపాల్ వర్మసినిమా ఫ్యాక్టరీ స్ధాపించి ముమ్మరంగాహిందీ సినిమాలు నిర్మిస్తున్న విషయంతెలిసిందే. ఆయన కె.సేరా సేరా ప్రొడక్షన్స్, సహారా వన్‌ఎంటర్‌టైన్‌మెంట్ సంస్ధలతోరామ్‌గోపాల్ వర్మ ఇప్పటికే ఒప్పందాలుకుదుర్చుకున్నారు. ఈ రెండుకార్పొరేట్ సంస్ధలు సమకూర్చిన నిధులతో వర్మ అనేక హిందీసినిమాలు నిర్మించారు. ఈ రెండు సంస్ధలు రెండోదశలో భాగంగా సంవత్సరంతర్వాత 24 సినిమాలకు ఫైనాన్స్ చేస్తాయి. అంతేగాక హిందీ, తెలుగు,తమిళ సినిమాలను దేశంలోనే గాకవిదేశాల్లోనూ పంపిణీ చేయాలని ఈ సంస్ధలుయోచిస్తున్నాయి. ఒక టీవీ ఛానల్‌ను కూడాస్ధాపించనున్నాయి. సినిమా రంగంలోకిభారీ కార్పొరేట్ సంస్ధలు రావడం వల్లప్రొఫెషనలిజం పెరిగే అవకాశముంది.












Click it and Unblock the Notifications