మనోజ్ ప్రభాకర్ మాయం!
దావూద్ముఠాతో సినీ నటి నగ్మాకుసంబంధాలున్నాయనే ఆరోపణపై కేంద్రదర్యాప్తు సంస్థ (సిబిఐ) దర్యాప్తుజరుపుతోందని మహారాష్ట్ర హోం మంత్రిఆర్. ఆర్. పాటిల్ చెప్పారు. తనవద్ద ఎక్కువ సమాచారం లేదనిఆయన మంగళవారం విలేకరులతోఅన్నారు. రాష్ట్ర పోలీసులు సేకరించినవిషయాలను సిబిఐకి అందజేస్తారని, తానుఈ విషయంలో ఎక్కువ మాట్లాడటం సరి కాదనిఆయన అన్నారు.
అయితేదావూద్ ముఠాతో సంబంధాలున్నట్లుచెబుతున్న నగ్మాను తాను కానని,నగ్మా పేరుతో మరో చిన్న నటి ఉందనిసినీ నటి నగ్మా చెప్పుకుంది. ఆ చిన్ననటి తల్లి పేరును కూడా నగ్మావెల్లడించింది. ఆ నగ్మా తల్లి పేరుతబుస్సుమ్ అని ఒక పత్రిక వెల్లడించిందనిఆమె చెప్పింది.
ఏమైనానగ్మాకు ఇది కష్టకాలమే. నగ్మాకుదావూద్ ఇబ్రాహీం సోదరుడు అనీస్తోసన్నిహిత సంబంధాలున్నాయని పోలీసులఅదుపులో ఉన్న రాజేష్ సంచారియా అలియాస్జంబో చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.మూడు నెలల క్రితం అరెస్టయిన జంబోతనకు దావూద్ ముఠాతోసంబంధాలున్నాయంటూ వెల్లడించాడనిచెప్పడంలో రాజకీయం ఉందని నగ్మావాదించింది. ఈర్ష్యాద్వేషాలతో, రాజకీయదురుద్దేశ్యంతో తనపై అసత్యప్రచారం చేస్తున్నారని ఆమె అన్నది.తనపై ఆరోపణలు చేసిన వ్యక్తిపైపరువు నష్టం దావా వేస్తానని ఆమెచెప్పింది.
ఏమైనానగ్మా చుట్టూ మరోసారి వివాదం అల్లుకుంది. ఈవివాదం నుంచి బయటపడటం ఆమెకుకష్టమే కావచ్చు. కాగా, నగ్మా తమపార్టీ ప్రధాన ప్రచారకురాలు కాదనికాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మవెల్లడించారు. భారత పౌరురాలిగాకాంగ్రెస్ను సమర్థించే అధికారంఆమెకుందని ఆయన అన్నారు. ఆరోపణలఆధారంగా ఒక నిర్ణయానికి రావడం సరికాదని కూడా ఆయన నగ్మాపై వచ్చినఆరోపణలపై అన్నారు.
- నగ్మా నజర్ ఎక్కడ?
- నగ్మా చేతిలో గంగూలీ క్లీన్‌బౌల్డ్
- నగ్మా కోల్కత్తా ప్రాజెక్టులు