గెటప్ మారనున్నటిడిపి
హైదరాబాద్:అధికారంలో ఉన్నప్పుడు హైటెక్ పోకడలుపోయిన చంద్రబాబు నాయుడు తెలుగు దేశంపార్టీని పేదల పార్టీగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. 1982లో టిడిపిఆవిర్భవించినప్పుడు ఆ పార్టీకి ఉన్న ఇమేజిని తిరిగితీసుకురావాలని ఆయన ఆలోచన. ఆనాడున్నఎన్టీఆర్ ప్రజాకర్షణ ఇప్పుడు ఎలాగూ రాదుకాబట్టి సామ్యవాద విధానాలతో పేదల పార్టీగాఇమేజిని పునరుద్ధరించుకోడానికి మే ఒకటో తేదీనుంచి కసరత్తు ప్రారంభిస్తారు. మే 27న మహానాడులో నూతన విధానాలనుఆవిష్కరించాలనుకుంటున్నారు.
అధికారంలోఉన్న కాలంలో విద్యార్ధి రాజకీయాలను,కార్మిక సంఘాలను నీరుగార్చిన చంద్రబాబునాయుడు ఈసారి మేడేఉత్సవాలను ఘనంగా జరిపి తెలుగునాడుకార్మిక సంఘాన్ని బలోపేతం చేయబోతున్నారు. హైటెక్‌మంత్రజపంతో రైతులకు, గ్రామీణ ప్రజలకు దూరమైన టిడిపిని మళ్లీ పేదలకుఅండగా ఉండే పార్టీగా తీర్చిదిద్దాలన్నదితెలుగుదేశాధీశుడి ఆలోచన. మళ్ళీఎన్నికల నాటికి తెలుగు దేశం పార్టీకి దశల వారీగా కాయకల్పచికిత్సచేయనున్నారు.
రైతులప్రభుత్వమని చెప్పుకుంటున్న వైఎస్‌ప్రభుత్వం రైతుల సమస్యలను ఏవిధంగా నిర్లక్ష్యం చేస్తున్నదోపెద్ద నోట్స్‌ను తెలుగు మేధావులుఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తయారు చేస్తున్నారు.ఐటీ, హైటెక్ పదాలకుసాధ్యమైనంత దూరంగా ఉండిపేదల సమస్యల మీద దృష్టి పెడతారు.సామాన్యుడి వేష భాషలను తలపించేలాచంద్రబాబు నాయుడు కాస్ట్యూమ్స్‌ను మార్చాలన్నసూచన కూడా తెలుగు మేధావులు చేసినట్టుసమాచారం. సామాన్య తెలుగు వాడిని తలపించేలాచంద్రబాబు నాయుడు పంచె కట్టుకు మారితేబాగుంటుందన్న సూచనపరిశీలనలో ఉన్నట్టు తెలిసింది.
ఇటీవలికథనాలు
- మాస్టర్ ప్లాన్!
- చక్రబంధంలో చంద్రబాబు
- చంద్రబాబుకుకేంద్ర రక్షణ!
- పరిటాల రాజకీయ వైరాగ్యం
- మా తెలుగు బాబుకు చాడీల దండ!
- ఇక బాబు రోడ్‌షోలు
- టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
- చంద్రబాబుతురుపుముక్క
- ఎన్టీఆర్ గుర్తున్నాడా?
- సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
- చిరంజీవిరహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం












Click it and Unblock the Notifications
