కథల్లేకకదలలేకపోతున్న ఎన్టీఆర్ కెరియర్
హైదరాబాద్:తెలుగు సినిమా రంగంలో తారాజువ్వలా దూసుకెళ్ళినజూనియర్ ఎన్టీఆర్ కెరియర్‌ఇప్పుడు నిరుత్సాహకర స్ధితికి చేరుకుంది. టాలెంట్‌పుష్కలంగా ఉన్నా, అభిమానుల సంఖ్య భారీగా ఉన్నా ఆయనకథలను ఎంపిక చేసుకోవడంలోఅజాగ్రత్తగా ఉంటున్నందువల్లనేఆంధ్రావాలా, నా అల్లుడు సినిమాలు నిరుత్సాహపరిచాయని ఆయనసన్నిహితుల అభిప్రాయం.
స్ధూలకాయం కారణంగా ఆయనకు పూర్తిస్ధాయి ప్రేమకథలు సూట్ కావడంలేదు. అలాగే పూర్తి యాక్షన్ చిత్రాలు కూడాఆయనకు పనికిరావన్న అభిప్రాయముంది.మాస్ ఫార్ములా హ్యూమర్- యాక్షన్‌కథలు మాత్రమే అయన సరిపోతాయన్నఅభిప్రాయం స్ధిరపడడంతో ఆయనకు కథలు చెప్పేవారు అటువంటికథలనే చెబుతున్నారు. దీనితో ఆయనకుపరిమితులు ఏర్పడ్డాయి. ఎటువంటిపాత్రనైనా అవలీలగా చేసే ఈజ్ ఆయనలోఉన్నప్పటికీ కథకులు గీసినలక్ష్మణరేఖల వల్ల ఆయనకు ఇబ్బందికరమైన పరిస్ధితులు ఏర్పడ్డాయి.
చిరంజీవి-పవన్‌కళ్యాణ్ అభిమానులు ఒక సమూహంగా బాలకృష్ణ-జూనియర్‌ఎన్టీఆర్ అభిమానులుమరో సమూహంగా చీలిపోయి ఉన్నారు. సినిమాబాగుండకపోయినా గతంలో అభిమానులు ఒకటికి పదిసార్లుచూసి ఫ్లాప్ సినిమాకు కూడా కొంత ఆక్సిజన్‌ఇచ్చేవారు.ఇప్పుడా పరిస్ధితి లేదు. అంది అంజి కావచ్చు,ఆంధ్రావాలా కావచ్చు, జానీ కావచ్చు అభిమానులు ఒకటి రెండుసార్లకు మించి చూడకపోవడం, ఫ్లాప్ టాక్ రాగానేసామాన్య ప్రేక్షకుడు ఆ థియేటర్ల వైపుమొహం తిప్పకపోవడంతో ఫలితంఒకటి రెండు రోజుల్లో తేలిపోతున్నది.
తమిళంలోలాగా పూర్తి కొత్తదనం ఉన్న కథలనుఎంపిక చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్‌కెరియర్ దివ్యంగా ఉంటుందనడంలోసందేహం లేదు. రాజమౌళి దర్శకత్వంలో రానున్న ఆయనసినిమా సూపర్ హిట్ అవ్వాలని అభిమానులుకోరుతున్నారు.












Click it and Unblock the Notifications