పరేఖ్ దెబ్బకు మార్కెట్ ఫట్
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 15-10-2005
బాలకృష్ణతోఒక మంచి రాజకీయ చిత్రం తీయడానికి తెలుగుదేశంనాయకుడు దేవేందర్ గౌడ్ ఒక సినిమానిర్మించనున్నట్టు తెలిసింది.కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ మళ్ళీపుంకుకోవాలంటే ఎన్టీఆర్ కుటుంబసభ్యుల అండఅవసరమని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. తన రాజకీయగురువైన ఎన్టీఆర్ కుమారుడితో సినిమాతీసి ఆయన రుణం తీర్చుకోవాలని దేవేందర్ గౌడ్ తాపత్రయపడుతున్నారు.వెరైటీ కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్టుతెలిసింది. బాలకృష్ణకు ఉన్న మాస్ ఇమేజ్‌నుతెలుగుదేశం పార్టీ ఉపయోగించుకోబోతోంది.
రాజకీయవర్గాల కథనం ప్రకారం బాలకృష్ణవచ్చే ఏడాది మార్చి నుంచి తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర వహించనున్నారు.ఇటీవల సినిమా రంగం అచ్చి రాకపోవడంతోరాజకీయ భవిష్యత్తుపై బాలకృష్ణ జ్యోతిష్యులనుసంప్రదించినట్టు తెలిసింది. కొంత కాలం చంద్రబాబునాయుడితో అంటీముట్టనట్టు ఉన్న హరికృష్ణకూడా ఈ మధ్య చంద్రబాబుకు మళ్ళీ సన్నిహితమయ్యారు.దగ్గుబాటి వెంకటేశ్వరరావు,ఆయన భార్య పురంధరేశ్వరి మినహాఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా తెలుగుదేశంపార్టీకి అండగా ఉన్నారన్న ఫీలింగ్‌నుప్రజలకు కలిగించడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
బాలకృష్ణనుతన రాజకీయ వారసుడిగా 1988లోనేప్రకటించిన ఎన్టీఆర్ ఆ తర్వాత మాట మార్చుకున్నారు. మొదట్లోబాలకృష్ణరాజకీయాలపై ఆసక్తి చూపించనప్పటికీ,తన తండ్రిగారి పేరు నిలబెట్టడానికి, తెలుగుదేశంపార్టీకి జీవం పోయడానికి ఆయన రాజకీయరంగాన్ని ఎంచుకునే అవకాశముంది. తెలుగుదేశంపార్టీలో హరికృష్ణ ఎదుగుదలను తట్టుకోలేకఆయనను బయటకు పంపిన చంద్రబాబునాయుడికి బాలకృష్ణ రాక సంతోషంకలిగించకపోవచ్చు.
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications