వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రవి అస్తమించినఅనంతపురం

By Staff
|
Google Oneindia TeluguNews
ఈ రౌడీఇజంఊబి నుంచి బయటపడాలని నాకూ ఉంది. కానీ బయటకు రాలేను.బయటికొస్తేబతకను అని అంటాడు నాయకుడు సినిమాలోమాఫియా నాయకుడైన హీరోతన కూతురితో. పరిటాలరవి జీవితం కూడా అంతే. ఆయన పుట్టిందిమంటల మధ్య. పెరిగింది అగ్నిగోళాల మధ్య.మరణించే వరకు ఆయనబతికున్నది మృత్యు దేవత నిత్యఘోషల మధ్య.

రాజకీయాలతో,హింసాత్మక సంఘటనలతో విసిగిపోయినఆయన ఒక దశలో దుబాయ్‌లోస్ధిరపడదామనుకున్నారు. అయినాఆయన సొంతగడ్డను దాటిపోలేకపోయారు. ఆయనప్రాణం ఏక్షణమైనా బలికావచ్చని అందరికీతెలుసు. కొన్నేళ్ళ క్రితం జూబిలీహిల్స్‌కారు బాంబు ప్రమాదం నుంచి తృటిలోబయటపడిన పరిటాల రవి తన భద్రతవిషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు.నలభై మంది ప్రైవేటుఅంగరక్షకులు ఆయనను కంటికిరెప్పలా కాపాడేవారు.

రాష్ట్రంలోకాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకివచ్చినప్పటి నుండి పరిటాల రవిఎక్కువగా అనంతపురంలో కాకుండాసొంత పల్లెలో ఉంటున్నారు.అనంతపురం జిల్లా ప్రజల్లో ఆయననుఅభిమానించే ప్రజలు అశేషంగా ఉన్నారు.ఆయన ద్వేషించే నాయకులు కొందరుఉన్నారు. ప్రగతిశీల భావాలు గల పరిటాల రవిఫ్యూడల్‌ శక్తుల నుంచి కింది వర్గాలప్రజలకు హాని జరగకుండా ఒక రక్షణకవచంలా పనిచేశారు. ఆయన తండ్రిరాములయ్య, తమ్ముడు హరి పీపుల్స్‌వార్‌లోపనిచేశారు. బడుగు, బలహీన వర్గాలకు రాములయ్య పెద్దఅండగా ఉండేవారు. తండ్రి, సోదరుడిమరణానంతరం ఆ గ్రూపు నాయకత్వబాధ్యత తీసుకున్నారు.1994 లోనే ఆయన తొలిసారిగాప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.పేదవారికి కూడు, గూడు అన్న ఎన్టీఆర్‌ నినాదంఆయనను బాగా ఆకర్షించింది. ఎన్టీఆర్‌ను ఆయన ఎంతగాఅభిమానించేవారో చంద్రబాబు ప్రజావ్యతిరేకవిధానాలనుఅంతగా వ్యతిరేకించేవారు. మార్స్కిస్టుసాహిత్యం చదవడం ఆయన హాబీ.ఇతర పుస్తకాలు కూడా ఆయన బాగా చదివేవారు.

ఫ్యాక్షన్‌రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని దురాగతాలకు ఎవరైనాపాల్పడకతప్పదు. రవి కూడా అటువంటివి చేసిఉండవచ్చు. కానీ ఆయనలో సుగుణాలు ఎన్నోఉన్నాయి. ఎన్టీఆర్‌ హయాంలో కార్మిక శాఖ మంత్రిగాపనిచేసిన ఆయన అవినీతికి దూరంగా ఉంటారన్నపేరుతెచ్చుకున్నారు. అవినీతిపరులైనఅధికారులను ఆయన తీవ్రంగాఅసహ్యించుకునేవారు. ఆయనవ్యాపారాలు, ఆదాయ మార్గాలు ఆయనకుఉండేవి. రాజకీయంగా అవినీతికి పాల్పడాలన్నఆశ, అవసరం ఆయనకుండేవి కావు.

పరిటాలరవికి ప్రాణభయం ఉందని టిడిపి మానవహక్కుల సంఘానికి,గవర్నరుకు, రాష్ట్రపతి వరకువినతి పత్రాలు సమర్పించింది. రవికి భద్రతా ఏర్పాట్లను అధికంచేసి ఉంటే ఈహత్య జరిగిఉండేది కాదు. రాజకీయ నాయకులు,పోలీసులు కుమ్మక్కు కాకుండా ఈహత్య జరిగే అవకాశం లేదు.అనంతపురం పట్టణంలో పార్టీ ఆఫీసులో ఒకకార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారని తెలిసినప్పటినుంచి ఇంటిలిజెన్స్‌ విభాగం చురుకుగాపనిచేసి ప్రత్యర్ధుల కదలికల గురించిఉన్నతాధికారులకు తెలియజేయాలి.ఇక్కడ అలా జరగలేదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయాలతోప్రమేయం ఉన్న హత్యలు జరగడం దారుణమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X