ఆర్తీతో ప్రేమ లేదు: తరుణ్‌

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 23-03-2005

Tarun & Aarti Agarwalహైదరాబాద్‌: సినీ నటి ఆర్తీ అగర్వాల్‌కు, తనకు మధ్య ప్రేమ వ్యవహారం ఏదీ లేదని తెలుగు సినీ హీరో తరుణ్‌ స్పష్టం చేశాడు. ఆర్తీ అగర్వాల్‌కు తనకు సన్నిహిత మిత్రురాలు మాత్రమేనని అతను అంటున్నాడు. ఒక ప్రైవేట్‌ టీవీ ఛానల్‌ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఈ విషయాలు చెప్పాడు. తనకు మంచి స్నేహితులైన మరో ఇద్దరు హీరోయిన్ల పేర్లు కూడా అతడు చెప్పాడు. అతడు చెప్పిన ఆ ఇద్దరు హీరోయిన్లు త్రిష, శ్రియ.

ఆర్తీ అగర్వాల్‌, తరుణ్‌ నటించిన సోగ్గాడు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం సంచలనం రేకెత్తించింది.

ఒక వర్ధమాన నటుడితో ఆర్తీ అగర్వాల్‌ ప్రేమలో పడిందని, అతడు పెళ్లికి సిద్ధపడకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని వార్తలు గుప్పుమన్నాయి. ఆ వర్ధమాన నటుడు తరుణ్‌ అని కూడా తేల్చిపారేశారు. ఈ స్థితిలో ఆర్తీకి, తనకు మధ్య ఏ విధమైన ప్రేమ వ్యవహారం లేదని తరుణ్‌ చెప్పాడు. నాతో ఆర్తీకి, తనకు మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తదేనని అతను కొట్టిపారేశాడు. తాను ఎవరినైనా ప్రేమించినా, తనను ఎవరైనా ప్రేమించినా దాచి పెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని, అటువంటిది ఉంటే చెప్పేస్తానని అతను అన్నాడు.

Tarun & Arthi Agarwalసహనటిగా, మిత్రురాలిగా, మానవతావాదిగా ఆర్తీ మళ్లీ అటువంటి చర్యను పునరావృతం చేయదని భావిస్తున్నట్లు అతను చెప్పాడు. ఆర్తీ అగర్వాల్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమైన విషయమని అతను అన్నాడు. సినిమాల్లో ఉన్నప్పుడు రూమర్స్‌ వస్తూనే ఉంటాయని, వాటిని పట్టించుకోకూడదని అతడి అభిప్రాయం. సహనటుడితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు జరుగుతున్న ప్రచారం తన కెరీర్‌కు నష్టం చేస్తాయని మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు ఆర్తీ అగర్వాల్‌ పోలీసులకు చెప్పింది. నాతో నటించేవారితో తాను సరదాగా ఉంటానని, ఎందుకలా ప్రచారం జరిగిందో తనకు తెలియదని తరుణ్‌ అన్నాడు.

"కాలేజీలో అమ్మాయి అబ్బాయి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటారు, కార్యాలయంలో సహోద్యోగులైన స్త్రీపురుషులు పక్కపనక్కన కూర్చుని మాట్లాడుకుంటారు, కానీ అక్కడ ఇటువంటివి రావు. అయితే సినిమా వచ్చే సరికి తేడా ఉంటుంది. ఇద్దరు హీరోహీరోయిర్లు సినిమాలో ప్రేమించుకుంటారు, నిజజీవితంలో కాస్తా సరదా ఉండేసరికి ఇద్దరకీ ప్రేమ వ్యవహారం ఉందని ఊహించుకుని ప్రచారం చేస్తారు అని తరుణ్‌ అన్నాడు.

తరుణ్‌ తల్లి రోజారమణి మాజీ సినిమా హీరోయిన్‌. తరుణ్‌ నటించేందుకు తీసుకునే మొత్తం నుంచి తరుణ్‌కు సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఆమెనే నిర్ణయం తీసుకుంటుందని వినికిడి. అంటే తెలుగు సినిమాల్లో హీరోనే అయినా తరుణ్‌ తల్లిచాటు బిడ్డడే అన్నమాట!

  • సోగ్గాడు సినిమా ఫొటో గ్యాలరీ

  • ఆర్తీ అగర్వాల్‌ ఆత్మహత్యా యత్నం

  • ఆర్తీ ప్రేమ వ్యవహారంలో పడలేదు: తండ్రి శశాంక్‌

    Recent Stories

    రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
    ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
    ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
    తిరగదోడినా ఫలితం శూన్యం?
    నేతాజీ మరణ రహస్యం?
    రవి అస్తమించిన అనంతపురం
    కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
    వేడుకలో వితరణ
    సీమ వేరుకుంపటి
    దొందూ దొందే
    కొత్త అధికార నివాసం
    ఆరు నెలలకే వారు వీరు
    ఐటీ ఉద్యోగుల ఉదారత
    2004 వెలుగునీడలు
    ఫ్లాష్‌న్యూస్‌
    మనసు పాట వినదు
    పాపం! బాజీ బజాజ్‌!
    తల్లీకొడుకుల అపూర్వ గాధ
    శత్రువు శత్రువు మిత్రుడవుతాడా?

    ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
    మాటల మరాఠీ!
    ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
    కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
    బాలకృష్ణపై చార్జిషీట్‌
    చిరుకథలో పెను మార్పులు!
    సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
    జయేంద్ర విశేషాలు
    ఒక టిడిపి నేత విజయ గాధ
    రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
    హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
    మన్మోహన్‌హంగ్‌!
    రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
    షిండే సక్సెస్‌ స్టోరీ
    ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
    ఉదయభాను విషాద గాధ
    ఉత్తమ కంపెనీల్లో సత్యం
    హిందీలో వీరప్పన్‌ సినిమా
    త్వరలో దాసరి ఛానల్‌!
    చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+