తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు?

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 30-03-2005 ;?

K C Rహైదరాబాద్‌: కొంచెం ఆలస్యమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కేంద్రమంత్రి. టిఆర్‌ఎస్‌ నాయకుడు కె.చంద్రశేఖరరావు వ్యాఖ్యానించగా చిన్న రాష్ట్రాలు శ్రేయస్కరం కాదని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నారు. ఇద్దరూ ఒకే రోజు ఢిల్లీలో వేర్వేరు చోట్ల ఈ ప్రకటనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై సోనియాగాంధీ తనకు హామీ ఇచ్చారని పదే పదే చెప్పిన చంద్రశేఖరరావు చాలాకాలం తర్వాత నిన్న నోరువిప్పి హరిహర బ్రహ్మాదులు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆగదని చెప్పారు. 2004 డిసెంబర్‌లోగా తెలంగాణ ఏర్పడుతుందని ఆయన గతంలో అనేక సార్లు ప్రకటించారు.

మరో వైపు ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్‌ నాయకులు రెండో ఎస్సార్సీయే తెలంగాణ రాష్ట్రంపై నిర్ణయం తీసుకుంటుందని గట్టిగా చెబుతున్నారు. ఇక్కడ వస్తున్న సందేహం ఏమిటంటే సోనియా గాంధీ తెలంగాణ విషయంలో రాజశేఖరరెడ్డికి ఒక మాట, చంద్రశేఖరరావుకు మరో మాట చెబుతున్నారా? ఆ అవసరం ఆమెకు ఉన్నదా? ఆమెకు తెలంగాణ సమస్యలు, వేర్పాటు వాదం గురించి ఇంకా అవగాహన ఏర్పడలేదనుకోవాలా? అసలు సోనియా గాంధీ ఉద్దేశం ఏమిటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయినా, ఏర్పడినా అందుకు కారణం సోనియాగాంధీయే అవుతారు. చంద్రబాబు నాయుడిని, వామపక్షాలను దెబ్బకొట్టాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమే మార్గమని మాటల మరాఠీ అయిన చంద్రశేఖరరావు సోనియాగాంధీకి వివరించినట్టు తెలుస్తోంది. దీనికి కౌంటర్‌గా రాజశేఖరరెడ్డి తన వాదనను సోనియా ముందు విన్పించినట్టు తెలిసింది. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ఎప్పుడో ముగిసిపోయిందని ఆయనను గానీ కమ్యూనిస్టులను గానీ సీరియస్‌గా తీసుకోనవసరం లేదని ఆయన వివరించారు. ఈ వాద ప్రతివాదాలు విన్న సోనియా గాంధీకి ఏంచాయాలో పాలుపోనట్టుంది.

ఢిల్లీలోని చంద్రశేఖరరావు, నరేంద్ర క్యాంపులలో మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన పేపర్‌ వర్క్‌ అంతా గుట్టుచప్పుడు కాకుండా పూర్తవుతోంద న్న ప్రచారం తీవ్రంగా ఉంది. తెలంగాణపై ఏర్పాటైన సబ్‌ కమిటీ ఇంతవరకు ఎందుకు నివేదిక సమర్పించలేదో అర్ధం కావడం లేదు. రెండో ఎస్సార్సీ అవసరమా కాదా అన్నది తేల్చాల్సింది ఈ ఉపసంఘమే. ఆ ఉపసంఘాన్ని చంద్రశేఖరావు మేనేజ్‌ చేసినట్టు తెలంగాణ వాదులు చెప్పుకుంటున్నారు. చంద్రశేఖరరావు చెబుతున్నట్టు హరిహర బ్రహ్మాదులు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆగకపోవచ్చు. ఎప్పుడు అన్నదే కీలక ప్రశ్న.

-సిహెచ్‌ శ్రీనివాసరావు

Recent Stories

సింధూర దేశభక్తి
షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+