వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పినవోక్స్‌ వ్యాగండం!

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 22-07-2005

హైదరాబాద్‌:వశిష్ట వాహన్‌ సంస్ధకు రాష్ట్రప్రభుత్వం తొందరపాటుగా చెల్లించిన 11కోట్ల రూపాయలను ఇవ్వడానికి జర్మనీ కార్లతయారీ సంస్ధ వోక్స్‌వ్యాగన్‌సంసిద్ధత వ్యక్తం చేయడంరాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి పెద్దరిలీఫ్‌. ప్రతి విషయాన్ని కొన్ని పత్రికలుగోరంతను కొండంతగా చిత్రీకరిస్తున్నాయన్నముఖ్యమంత్రి విసుర్లకు విశ్వసనీయతఏర్పడినట్టయింది. ప్రజాధనం విషయంలోకాంగ్రెస్‌ ప్రభుత్వాలు అడ్డగోలుగావ్యవహరిస్తుంటాయన్న సాధారణఅభిప్రాయాన్ని కూడా ఈ ఉదంతం వమ్ము చేసింది. ఢిల్లీలోచంద్రశేఖరరావుతో చర్చలు కూడా సఫలం కావడంతోటిఆర్‌ఎస్‌తో వచ్చిన తలనొప్పికి కొంతఉపశమనం కలిగినట్టయింది. టిఆర్‌ఎస్‌మంత్రుల రాజీనామాలు, ముఖ్యశాఖలకు మంత్రులు లేకపోవడంతోమంత్రివర్గాన్ని విస్తరించకుండా ఆయన నెట్టుకొస్తున్నారు. అదనపుశాఖలను ఉన్న మంత్రులకే కేటాయించడంద్వారాఆయన తన మొండి పట్టును నెగ్గించుకున్నారు.

పత్రికల్లోఏవైనా కుంభకోణాల గురించి విలేకరులుప్రస్తావించినప్పుడల్లా ఆయనతృణీకారమైన ఒక నవ్వు నవ్విఅయితే ఏంటట అని ఎదురు ప్రశ్నలు వేస్తుంటారు. పత్రికల్లోవచ్చేవన్నీ నిజమని నమ్మడానికి వీల్లేదని ఆయనసెలవిస్తుంటారు. ఆయనకు అన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి అంతఆత్మవిశ్వాసంతో ఉండగలుగుతున్నారు.అయితే రాష్ట్రంలో పరిస్ధితులు అంతసవ్యంగా లేవు. ఆ విషయాన్ని నేడుముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో అంగీకరించారు. ఆర్టీసీఉద్యోగులు ఏరోజైనా సమ్మె ప్రారంభించేఅవకాశముంది. అగ్నికి ఆజ్యం తోడైనట్టుపిఆర్‌సి నివేదిక అమలులో జాప్యంకారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుసమ్మె చేయాలని ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలోనికొన్ని ప్రాంతాల్లో ఇటీవల వర్షం బాగానేకురిసినప్పటికీ దాదాపు సగం జిల్లాల్లోసగటు కంటే తక్కువ వర్షపాత నమోదైంది. ఈ సంవత్సరంకూడారైతులకు కడగండ్లుతప్పకపోవచ్చన్న భయాలు ఉన్నాయి.

ఈనేపధ్యంలో రానున్న ఎన్నికలు వైఎస్‌రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పనితీరుకుఒక కొలమానం కానున్నాయి. మునిసిపల్‌ఎన్నికల్లో కాంగ్రెస్‌- టిఆర్‌ఎస్‌ పొత్తుతధ్యంగా కన్పిస్తుండగాటిడిపి-బిజెపిల మధ్య పొత్తు కుదిరేఅవకాశం లేదు. యావత్‌ రాష్ట్రప్రభుత్వం పనితీరుకు మునిసిపల్‌ఎన్నికల ఫలితాలు పూర్తి గీటురాయి కాకపోయినాకొంతవరకు అద్దం పడతాయి.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X