వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకమాండ్‌ పీడ,పిసిసి నీడ

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 15-03-2005

YSRహైదరాబాద్‌:రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరంతప్పనట్టు ముఖ్యమంత్రి అయ్యాక కూడావైఎస్‌ రాజశేఖరరెడ్డికి పిసిసి పీడతప్పడం లేదు. ముఖ్యమంత్రి కంటేపిసిసి అధ్యక్షుడే ఎక్కువని, రాష్ట్రంలోనివ్యవహారాలపై సోనియా గాంధీ మొదటతననే సంప్రదిస్తారని కె.కేశవరావు చెప్పుకొచ్చారు. ఈ మాటలుసహజంగా రాజశేఖరరెడ్డికి బాధకలిగిస్తాయి. లిటిగెంట్‌ అయినకేశవరావు పిసిసి అధ్యక్షుడుకావడానికి వైఎస్‌ కూడా ఒక కారణం. నియోజకవర్గమంటూలేనికేశవరావును పిసిసి అధ్యక్షుడిని చేస్తే చెప్పినట్టు పడిఉంటాడనిభావించినవైఎస్‌కు ఇప్పుడు చుక్కలు కన్పిస్తున్నాయి.రాష్ట్రంలో పాలనవ్యవహారాలు సరిగాలేవనుకుంటే సోనియా గాంధీప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటారనికేశవరావు చేసిన ప్రకటన వైఎస్‌శిబిరంలో ప్రకంపనాలు సృష్టిస్తోంది.

కాంగ్రెస్‌ముఖ్యమంత్రుల కంటే ఆయా రాష్ట్రాలపిసిసి అధ్యక్షులే శక్తిమంతులని సోనియా గాంధీచెబుతున్న మాట వాస్తవమే. గతంలో పిసిసిఅధ్యక్షులుగా ఉన్న ఎం.సత్యనారాయణరావుకు, డి. శ్రీనివాస్‌కుఆమె ఈ విషయం పదేపదేచెప్పేవారు. ఇటీవల భజన్‌లాల్‌కూ ఆసత్యం చెవిన వేశారు. సోనియాగాంధీప్రధానిగా ఉండకుండా కాంగ్రెస్‌ జాతీయఅధ్యక్షురాలిగా ఉండడమే దీనికికారణం కావచ్చు. పిసిసి అధ్యక్షులు నేరుగాఆమె పర్యవేక్షణలోఉంటారు.కేశవరావు ధోరణి చూస్తుంటేఆయనకు పెద్ద ఆశలేఉన్నట్టు కన్పిస్తోంది. తెలంగాణ వాది అయినకేశవరావు సరైన సమయంలోదానిని పెద్ద ఇష్యూ చేయవచ్చు. ఆయనకు చంద్రశేఖరరావుతోసన్నిహితసంబంధాలు ఉన్నాయి.

ఇక చింతచచ్చినా పులుపు చావలేదన్నట్టు పిసిసి మాజీఅధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ ధోరణి ఉంది.గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిసిసిఅధ్యక్షుడిగా ఉన్న ఆయన కాంగ్రెస్‌విజయం సాధించడంలో తన పాత్ర కూడాఉందన్న ఫీలింగ్‌ ఉంది. పార్టీలో ఐఖ్యతకుతాను కృషి చేశానని, ముఖ్యమంత్రిపదవి బిసి అయిన తనకే దక్కాలనిఆయన అధిష్టానవర్గాన్నివేడుకున్నారు. అధిష్టానవర్గం విధిలేనిపరిస్ధితిలో వైఎస్‌ను ముఖ్యమంత్రిని చేయవలసి వచ్చింది. ఆసమయంలో హైకమాండ్‌ మొహమాటానికైనాడిఎస్‌కు తర్వాత నువ్వే అని చెప్పిఉంటుంది. దీనితో ముఖ్యమంత్రి పదవిపై డిఎస్‌ఆశలు పదిలంగా ఉన్నాయి. రేపుహైదరాబాద్‌లో సోనియా గాంధీ బహిరంగసభకు ఆయన నిజామాబాద్‌ నుంచి పెద్ద ఎత్తునజనాన్నితరలిస్తున్నారు. ఐదున్నర లక్షలుఖర్చుచేసి ఆయన నిజామాబాద్‌ నుంచిసికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు సర్వీసుఏర్పాటు చేశారు. ఏ మంత్రీ తీసుకోనంత శ్రద్ధను డిఎస్‌తీసుకోడానికికారణమేమిటి? వైఎస్‌కే తెలియాలి.

Recent Stories

ఢిల్లీ పిలుపు ఒకమలుపు!
చేతులెత్తేస్తున్నప్రభుత్వం
వైఎస్‌ భయాలు, భ్రాంతులు!
కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్‌ ప్లస్‌ పవర్‌
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం

వైఎస్‌ అసహనం
కప్పల తక్కెడ
మూడో పవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
ఐటీ మీద వైఎస్‌ దృష్టి హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X