పొత్తులే ప్రధానాంశం

ప్రజా క్షేత్రం వేరు, బ్యాక్ గ్రౌండ్ రాజకీయాలు వేరు. వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావు తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆయన చంద్రశేఖరరావుకు, చిరంజీవికి ప్రధాన సలహాదారుగా మారారు. ఈ పరిణామం మరి చంద్రబాబు నాయుడుకు బాధ కలిగించదా? కావచ్చు. కానీ ఇక్కడ రామోజీరావుకు కావలసింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం కాదు, వైఎస్ ను గద్దె దించడం.
అందుకోసం ఆయన ఈసారి తీవ్ర ప్రయత్నాలే చేసే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవిని భుజాన వేసుకోవడం ద్వారా ఈనాడు పత్రిక సర్క్యులేషన్ పెరిగినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు టిడిపితో టీఅర్ ఎస్, చిరంజీవి పార్టీలు కలవకపోయినా ఎన్నికల తర్వాత అయినా ఈ మూడిటిని కలిపి వైఎస్ రాజ్యానికి చరమగీతం పాడాలన్నది రామోజీరావు ఆలోచనగా కన్పిస్తోంది.
ఎక్కువ సీట్లు అడగవచ్చన్న ఆలోచనతో ఇప్పుడు చిరంజీవి వైపు మొగ్గు చూపిస్తున్న వామపక్షాలు, టీఅర్ ఎస్ లు చివరికి చంద్రబాబు నాయుడు తోక పట్టుకుని కదన రంగంలో దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. సీట్ల సర్దుబాటు ఈసారి రాజకీయ పార్టీల మధ్య ప్రధానాంశం కానుంది. సొంతంగా తనకు 200 కు తగ్గకుండా సీట్లు వస్తాయన్న అతి విశ్వాసంతో ఉన్న చిరంజీవి టీఅర్ ఎస్ కు, వామపక్షాలకు వారు కోరినన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధపడకపోవచ్చు. ఇదే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు ప్రధానాంశం కానుంది.












Click it and Unblock the Notifications