చిరు-చంద్ర గ్రహణంbrచిరంజీవి పార్టీ వల్ల తెలుగుదేశానికే ఎక్కువ నష్టం........

కాపు వర్గం బలంతో ముందుకు వస్తున్న చిరంజీవి, కమ్మ వర్గానికి ఏమాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా కాపు అభిమానులు ఆయన మీద అలిగే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఆ విషయం నాలుగున్నరేళ్ళ క్రితమే విజయవాడ లోక్ సభ ఎన్నికలో నిరూపితమైంది. ఆనాడు తెలుగుదేశం పార్టీకి, కమ్మ కులానికి చెందిన అశ్వనీదత్ కు ఓటు వేయమని చిరంజీవి పిలుపు ఇచ్చినా చిరు అభి మానులు వినలేదు. తమ అభిమాన హీరో సొంతంగా పార్టీ పెట్టకుండా ఇలా చేయడమేమిటని ఆనాడు ఆయన కృష్ణా జిల్లా అభిమానులు బాధ పడ్డారు.
ఇప్పటి పరిస్ధితి అలాగే ఉండే అవకాశం కన్పించడం లేదు. చిరంజీవి ఓపెన్ గా రాజకీయాల్లోకి రావడం ఆయన అభిమానులను ఆనంద సాగరంలో ముంచెత్తుతోంది. చిరంజీవి కులాలకు మతాలకు అతీతంగా ఒక మానవీయ దృక్పథంతో ముందుకు రావడంతో, కొత్తదనాన్ని ఆహ్వానించడానికి ప్రజలు సిద్ధమవుతున్నటు కనిపిస్తోంది. వికలాంగులతో ఆయన తన పార్టీ ఆఫీసులో ఎక్కువ సేపు గడపడం, అందుకు మీడీయాలో మంచి ప్రచారం రావడం నిజంగా గొప్ప విషయమే. గతంలో ఎన్టీఆర్ కూడా చేయని రీతిలో చిరంజీవి ఈ విధమైన వ్యూహాన్ని అవలబించడం మహిళలను, యువతను బాగా ఆకర్షిస్తోంది.
చిరంజీవి పార్టీ బలపడుతున్న కొద్దీ తెలుగుదేశం బలపడుతున్నట్టు ఇప్పుడు అనిపిస్తోంది. కానీ దీర్ఘకాలంలో కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం జరుగుతుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలా ఉన్న కాపు, మాల ఓట్లు ఇప్పుడు చిరంజీవి పార్టీకి పెద్ద్ ఎత్తున పడే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించింది. ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్ధితి, సమాచారం ప్రకారం చిరంజీవి టాప్ స్ధానం లో ఉండగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండో స్ధానం కోసం పోటీ పడుతున్నాయి. మిగితా వివరాలు రేపు ఇదే సమయంలో....












Click it and Unblock the Notifications