బాలయ్యకూ బాబు వెన్నుపోటు?

చంద్రబాబు నాయుడు తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు బాలకృష్ణను నిన్న ఆకాశానికి ఎత్తేశారు. గుంటూరు సదస్సుకు బాలకృష్ణను చూడడం కోసమే లక్షలాది జనం తరలి వస్తున్నారని ఆయన అన్నారు. అన్న చంద్రబాబు ఏమనుకుంటాడోనన్న జంకు కూడా లేకుండా రామ్మూర్తి నాయుడు ఈ విధంగా వ్యాఖ్యానించడం, ఆ కామెంట్స్ ను ప్రత్యర్ధి పత్రికలు ప్రముఖంగా ప్రచురించడంతో చంద్రబాబు నాయుడు అగ్గి మీద గుగ్గిలం అయినట్టు సమాచారం. సొంత తమ్ముడు ఎదిగితేనే తట్టుకోలేని చంద్రబాబు నాయుడు బాలకృష్ణ ముఖ్యమంత్రి పీఠానికి చేరువు అవుతుంటే సహించగలరా?
ఒక వ్యూహం ప్రకారం బాలకృష్ణతో వియ్యం అందుకున్నారు చంద్రబాబు నాయుడు. బాలకృష్ణ భోళా శంకరుడు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి పోటీపడబోరని గట్టి విశ్వాసం చంద్రబాబు నాయుడిది. కానీ బాలకృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణే ముఖ్యమంత్రి కావాలని ప్రగాఢంగా కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని గుంటూరు గర్జనలో గాండ్రించి చెప్పడానికి బాలయ్య అభిమానులు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం రాజకీయాల వరకు గుంటూరు గర్జన చాలా కీలకమైనది కానుంది.
మహానాయకుడు ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడికి, ఎంతో సాఫ్ట్ గా ఉండే బాలకృష్ణను మోసం చేయడం చాలా సులభమని ఇప్పటికే బాలయ్య అభిమానుల మధ్య ఎస్ ఎంఎస్ లు సంచరిస్తున్నాయి. ఒక వేళ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల సహకారంతో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడా? బాలకృష్ణా? మీరే ఊహించండి. దట్స్ తెలుగు డాట్ కాం పోల్ లో పాల్గొనండి.












Click it and Unblock the Notifications