నందమూరి మందుపాతర!

Chandrababu
హైదరాబాద్: చెట్టును కొట్టి నెత్తి మీద వేసుకున్నట్టయింది చంద్రబాబు నాయుడి పరిస్ధితి. నందమూరి హీరోలందరినీ తెలుగుదేశం జెండా కింద చేర్చి ఎన్నికల సాగరాన్ని గట్టెక్కాలని చంద్రబాబు నాయుడి ఆఖరి ప్రయత్నం. తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సినిమావాళ్ళు బెల్లం చుట్టూ ఈగల్లా చంద్రబాబు చుట్టూ మూగారు. ఆ రోజుల్లో ఒక్క ఆదిశేషగిరిరావు, ఒక్క ధర్మవరపు సుబ్రమణ్యం మినహా అందరిదీ పసుపు పచ్చ రంగే. అందరి జెండా తెలుగుదేశమే. ఎప్పుడైతే చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయిందో సినీతారలు కొంతకాలం డార్క్ లోకి వెళ్ళిపోయి, ఇప్పుడు కాంగ్రెస్, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీల్లో చేరుకుని తమకివ్వబోయే డైలాగులను ఊహించుకుని గాలిలో రిహాల్సల్స్ చేస్తున్నారు.

ఒక్క మురళీ మోహన్, బాబూమోహన్ మినహా ఇప్పుడు చెప్పుకోదగిన సినిమావాళ్ళెవరూ తెలుగుదేశం పార్టీలో లేరు. కులవాదిగా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పేరున్న మురళీమోహన్ ను చేర్చుకోడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. అలాగే వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందో లేదో తెలియని స్ధితిలో కాంగ్రెస్ లో చేరడానికి ఎందుకు మోజు చూపాలని మురళీ మోహన్ అనుకుంటున్నట్టు తెలిసింది. ఈ నేపధ్యంలో దిక్కులేని స్ధితిలో చంద్రబాబు నాయుడు నందమూరి హీరోల సహాయాన్ని ఆర్తిగా కోరుకున్నారు. బాలకృష్ణ ఎటూ వియ్యంకుడు అయ్యాడు కాబట్టి ఆయన పని తేలిక అయింది. బాలకృష్ణ మీద గౌరవం కొద్దీ నందమూరి హీరోలందరూ ఒక తాటి మీదకు వచ్చినట్టు కనిపిస్తోంది.

నందమూరి వంశం అనే సింహం మీద స్వారీ చేయడానికి సిద్ధమవుతున్న చంద్రబాబు నాయుడు త్వరలోనే కొన్ని కఠోర వాస్తవాలను తెలుసుకునే అవకాశముంది. రాజ్యాధికార మైకం ఎటువంటిదంటే తండ్రినైనా, సోదరులనైనా చంపడానికి వెనుకాడనటువంటిది. తన మీద రాజు ఎక్కి స్వారీ చేసినంతవరకు సింహానికి ఏ బాధా ఉండదు. ఎప్పుడైతే రాజు కిందికి దిగాడో సింహం అతడిని తండూరీ చికెన్ లాగా తినేయడానికి వెనుకాడదు. నందమూరి తారకరత్న అవే సంకేతాలను వదులుగుతున్నాడు. వివిధ జిల్లాల్లో పనిగట్టుకుని తెలుగుదేశం తరఫున తన అభిమానులను సమీకరిస్తున్న ఆయన "మా బాలయ్య బాబాయి ముఖ్యమంత్రి కావాలి" అని ఘంటాపథంగా ఆకాంక్షిస్తున్నారు. తారకరత్న చేస్తున్న ఈ మీటింగులు, ఈ ప్రకటనలు చంద్రబాబు నాయుడిని తీవ్రంగా కలవరపరుస్తున్నాయి.

చంద్రబాబు నాయుడు స్వతహాగా ధైర్యశాలి కాదు. గత ఎన్నికల ముందు ఒక పనికి మాలిన అధికారి ఒకరు "రేపు రాజీనామా చేసి, టీఅర్ ఎస్ లో చేరుతున్నా" అని ఒక ప్రకటన ఇవ్వగానే చంద్రబాబు నాయుడు తన విలువైన సమయాన్ని దాదాపు మూడు గంటల సేపు ఆ పనికి మాలిన అధికారి కోసం కేటాయించిన విషయం రాష్ట్ర రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న వారందరికీ తెలిసిందే.

ముందు ముందు మరెవరితోనో కాదు నందమూరి వారసులతోనే చంద్రబాబు నాయుడు క్లిష్ట పరిస్ధితులను ఎదుర్కోవలసి ఉంటుంది. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారంలోకి రాకపోతే ఆయనను ఢిల్లీ పంపేసి (రాజ్యసభ సభ్యత్వం ఇప్పించి) ఇక్కడ బాలకృష్ణ, ఇతర నందమూరి హీరోల సారధ్యంలో మరో ఐదు సంవత్సరాల తర్వాత అయినా టిడిపిని అధికారంలోకి తెచ్చేందుకు కులపెద్దలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. "ప్రపంచమొక పద్మవ్యూహం, అధికారమొక తీరనిదాహం" అంటే ఇదేనేమో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+