కర్ణాటక హద్దుల్లో చిరు హవా?

Chiranjeevi
హైదరాబాద్: చిరంజీవి అనంతపురం జిల్లా పర్యటన కూడా విజయవంతం కావడంతో సమీపంలోని కర్ణాటక రాష్ట్రంలో చిరంజీవి క్రేజ్ పెరిగింది. కర్ణాటకలోని ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో తెలుగువారి సంఖ్య అధికంగా ఉంది. ఆ ప్రాంతాల్లో చిరంజీవి సినిమాలు బాగా ఆడాయి. ఆ ప్రాంతాల్లోని దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చిరంజీవి ప్రభావం బాగా ఉందని తెలుస్తోంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఇప్పట్లో లేవు. లోక్ సభ ఎన్నికలు మాత్రం దేశవ్యాప్తంగా మూడు నాలు నెలల్లో జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు అతి త్వరలో జరుగనున్నాయి. చిరంజీవి క్రేజ్ కర్ణాటక రాష్ట్రానికి పాకడం వల్ల అక్కడ కొన్ని లోక్ సభ స్ధానాల్లో చిరు ప్రజారాజ్యం అభ్యర్ధులు గెలిచే అవకాశాలున్నాయన్న అభిప్రాయముంది. దానితో అక్కడ స్ధిరపడి వ్యాపారాలు చేసుకుంటున్న తెలుగు ప్రముఖుల్లో చిరు టికెట్ల మీద మెగా ఆశలు నెలకొన్నాయి.

చిరంజీవి ఈ మధ్య తన శైలిని మార్చుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. మొదట్లో ఆయనలో సినిమా తరహా వినయం కన్పించేది. రాజకీయ నాయకులను విమర్శిస్తే ఇన్ కంటాక్స్ శాఖ నుంచి ఎప్పుడు ఏ సమస్య వచ్చి పడుతుందోనన్నట్టు ఆయన భయపడేవారు. ఆదాయపు పన్ను శాఖకు సంబంధించి ఆయన తాను క్లీన్ అని చెబుతున్నప్పటికీ తవ్వి తీస్తే కొన్ని సమస్యలు బయటపడక మానవు.

అయితే చిరంజీవి ఇప్పుడు వాటికి భయపడవలసిన అవసరం లేదు. ఆయన వెనుక అపారమైన జనం ఉన్నారు. ఇప్పుడు ఆయన మీద ఎటువంటి లీగల్ ఫిటింగ్స్ పెట్టడానికి అధికారంలో ఉన్నవారు సాహసించలేరు. చిరంజీవి భద్రతకు గానీ, ఆయన ఆస్తులకు గానీ ఎటువంటి థ్రెట్ వచ్చినా ఆయన అభిమాన జనం లక్షల సంఖ్యలో తిరగబడడం ఖాయంగా కనిపిస్తోంది.

చిరంజీవి అంటే ఇప్పుడు ఎక్కువగా భయపడుతున్నది వైఎస్ కాదని, చంద్రబాబు నాయుడేనని తెలుస్తోంది. ఆ రెండు ప్రధాన పార్టీలు ప్రైవేటుగా చేయించుకున్న సర్వే వివరాల ప్రకారం చిరంజీవి వల్ల తెలుగుదేశం పార్టీకే ఎక్కువ నష్టం జరగనుందని తెలుస్తోంది. కులాలను బట్టి కాకుండా యువ ఓటర్లు టిడిపి నుంచి చిరు పార్టీకి షిఫ్ట్ కానున్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+