చిరంజీవి పార్టీ- కొన్ని అంశాలుbrవెనుకబడిన కులాల మద్దతు లేకుండా చిరు మనుగడ సాధ్యమా?

కులాల గురించి మాట్లాడడం సంస్కార హీనం అన్న అభిప్రాయాన్ని కొందరు ప్రగతిశీల వాదుల పేరుతో ప్రచారం చేశారు. కానీ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వంటి వారు కులమే సామాజిక సత్యమని, కుల రహిత సమాజం ఏర్పడాలంటే కింది కులాల వారిని సామాజికంగా, ఆర్ధికంగా పైకి తేవాలని సిద్ధాంతీకరించారు. ఆయన ఆదర్శాలను పాటించి ఎన్టీ రామారావు బిసి కులాల వారికి తన పార్టీలో ఎక్కువ టికెట్లు ఇచ్చి వారికి రాజ్యాధికారం కల్పించారు.
చిరంజీవి కూడా హిపోక్రసీకి పోకుండా అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అనే ఎజెండాతో ముందుకు వస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయనడంలో సందేహం లేదు. కానీ చిరంజీవి అగ్రవర్ణాలకు తన పార్టీలో ప్రాధాన్యం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఆయన పార్టీ మనుగడకే కాక స్వయంగా ఆయనకు కూడా ప్రమాదకరమని సోషలిస్టు భావజాలాన్ని నమ్మే వారు హెచ్చరిస్తున్నారు.
చిరంజీవి కాపు కులానికి చెందినవారు. పశ్చిమ గోదావరి కాపులు అగ్ర కులాల జాబితాలో ఉన్నారు. అయితే రాష్ట్ర జనాభాలో అగ్రకుల కాపుల సంఖ్య దాదాపు ఆరు శాతమే. తెలగ, మున్నూరుకాపు, ఒంటరి వంటి సహోదర కులాలు కలిస్తే మొత్తం కాపుల సంఖ్య రాష్ట్ర జనాభాలో 20 శాతం పైగా ఉంటుంది. చిరంజీవి పార్టీకి ఈ 20 శాతం జనాభా పెట్టని కోటగా ఉండే విషయంలో సందేహం లేదు. కాకపోతే గౌడ, యాదవ, పద్మశాలి, మత్స్యకారుల వంటి బిసి కులాల వారు చిరంజీవికి మద్దతు ఇస్తారా లేదా అన్న విషయం ఇంకా స్పష్టం కావడం లేదు. గతంలో ఎన్టీ రామారావుకు ఈ బిసి కులాల వారు గట్టి మద్దతు ఇచ్చారు. చిరంజీవి శిబిరంలోని మేధావులు ఈ దిశగా దృష్టి సారించడం మంచిది.












Click it and Unblock the Notifications