చిరు వ్యూహం ఫలిస్తుందా?

రోడ్‌షోలకు ప్రత్యా మ్నయంగా దీటైన ప్రచారం నిర్వహించడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కెసిఆర్ నియోజక వర్గానికో బహిరంగ సభ, చిరు సహపంక్తి భోజనాలు తెరపైకొచ్చాయి.రోడ్ షోలకు కోర్టు బ్రేక్ వేయడంతో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రచారాన్ని ఏదో రూపంలో తిరిగి ప్రారంభించాలని కెసిఆర్ తలంచారు. దీనితో నియోజకవర్గానికో బహిరంగ సభ పేరుతో భారీ ప్రచారానికి తెరతీస్తే చిరంజీవి సహపంక్తి భోజనాల ద్వారా ప్రజల మధ్యకు వెళ్ళాలని నిర్ణయించారు. ఈ మేరకు రేపు మెదక్ జిల్లా సింగన్నగూడెంలో పంక్తి భోజనం చేయనున్నారు. దీనికోసం స్థలాన్ని నిర్ణయించేందుకు ఆ పార్టీ నేత హరిరామజోగయ్య ఈరోజు గజ్వేల్, పటాన్‌చెరు, ఆంథోల్ నియోజకవర్గాల్లో పర్యటించారు.మరి ఈ ఎత్తు ఫలిస్తే...చిరుకు కొంత ఊరట లభించినట్లే..కాంగ్రేస్, తెలుగు దేశం వారు మరో ప్రత్యన్నమ్మాయం ఎతుక్కోవాల్సిందే.












Click it and Unblock the Notifications