ప్రతి రోజూ 'ప్రజారాజ్యమే'

అధికారంలోకి రాకముందే ఇంత అహంభావం ప్రకటించడం మంచిది కాదేమో. పార్టీని ప్రకటించిన రోజు తాను ఒక కానిస్టేబుల్ కొడుకునని చెప్పిన చిరంజీవి ఈనాడు ఇలా మాట్లాడడం ఎంత వరకు సబబు? ఎక్సైజ్ కానిస్టేబుల్ కు ఆ శాఖ కమిషనర్ గా ఉండే ఐఎఎస్ ఆఫీసర్ కు ఎంత తేడా ఉంటుందో చిరంజీవికి తెలియకుండా ఉండదు.
చిరంజీవి చాలా వినయ సంపన్నుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒక సామాజిక వర్గం ఆధిపత్యంలో ఉన్న సినిమా రంగంలో స్వయంకృషితో ఎదిగిన ఘనత చిరంజీవిది. కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేసరికి చిరంజీవిలో ఆ "స్పష్టత" కన్పించడం లేదన్నది విమర్శ. అయితే స్పష్టత ఏమిటి, అస్పష్టత ఏమిటి అన్నదే ప్రశ్న. చిరంజీవి తనకు తాను స్పష్టంగా ఉన్నానని అనుకోవచ్చు. కానీ చిరంజీవి ఇప్పుడు అందరి వాడు. కులమే సామాజిక సత్యంగా మారిన నేపద్యంలో ఆయన మరింత స్పష్టతతో ముందుకు రావలసిన అవసరముంది. కేవలం టెక్స్ట్ బుక్ నాలెడ్జితో ఆయన వ్యవహరిస్తే ఒక పెద్ద ప్రయోగం విఫలం కావచ్చు.
చిరంజీవి పార్టీ తెలంగాణలో టీఅర్ ఎస్ తో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందన్నది తాజా చర్చనీయాంశం. టీఅర్ ఎస్ ఇప్పటికీ సొంతంగా తెలంగాణలో ఒక రాజకీయ శక్తిగా ఎదగలేకపోయింది. అందువల్ల అయితే టిడిపితోనో, లేదా చిరంజీవి పార్టీతోనో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ ప్రయత్నం చేస్తోంది. ఎవరు ఎక్కువ స్ధానాలు ఆఫర్ చేస్తారో అని ఎదురు చూసే పరిస్ధితి ఇప్పుడు టీఅర్ ఎస్ కు దాపురించింది.












Click it and Unblock the Notifications