స్పీడ్ పెరిగిన ప్రజారాజ్యం

chiranjeevi
హైదరాబాద్: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రభావం చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన చిరంజీవి ప్రజా అంకిత యాత్ర విజయనగరం జిల్లాకు చేరుకునేసరికి మహా ప్రభంజనంగా మారింది. అగ్రవర్ణాల ఆధిపత్యం లేని ఉత్తరాంధ్రను తన తొలి యాత్రలకు ఎంపిక చేయడంలో చిరంజీవి సలహాదారుల మేధాశక్తి కన్పిస్తోంది. ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఇప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం రాష్ట్ర రాజకీయాల్లో ప్రబలశక్తి.

శ్రీకాకుళం జిల్లాలో మొదటిరోజు చిరంజీవి తడబడినా రెండో రోజు నుంచి ఆయన ప్రసంగాలు పదునుతేలాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఇప్పుడు ఆయన బాగానే విమర్శించగలుగుతున్నారు. దానికి ప్రజల నుంచి స్పందన చెప్పుకోదగిన విధంగానే ఉంది. చిరంజీవి ఉత్తరాంధ్ర యాత్ర విజయవంతం కావడం దేనికి సంకేతం? అక్కడ బలంగా ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్ రెండు పార్టీలకు ప్రజారాజ్యం పెను ముప్పు తీసుకురాబోతోందన్న సంకేతాలు ఉన్నాయి. ఇదే పరిస్ధితి రాష్ట్రమంతటా ఉన్నా ఆశ్చర్యం లేదు. తెలుగుదేశం, టీఅర్ ఎస్ కలిస్తే తెలంగాణలో ప్రజారాజ్యం పార్టీ అంతగా బలపడకపోవచ్చు.

చిరంజీవి పార్టీ ప్రభావం పై అధికార కాంగ్రెస్ మేధావుల మధనం ప్రారంభమైంది. చిరు ప్రభంజనాన్ని లైట్ గా తీసుకోడానికి వీల్లేదని కొందరు వైఎస్ కు తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిరంజీవి పార్టీనికి ఇంకా లైట్ గానే తీసుకుంటున్నారు. ఆయన చేతిలో ఏదో తురుపు ముక్క ఉందన్న అభిప్రాయం కలుగక మానదు. అయితే చిరంజీవికి సంబంధించిన రహస్య డాక్యుమెంట్లు ప్రభుత్వం వద్ద ఉంటే ఉండవచ్చు. కానీ చిరంజీవి రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత వాటిని లీక్ చేసినా జనంలో విశ్వసనీయత ఉండదు.

అభిమానుల బలాన్ని ఓట్లుగా మలుచుకునే దిశగా చిరంజీవి శిబిరంలో వ్యూహ రచన జరుగుతోంది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకర్గాల వారీగా కమిటీలు సిద్ధమవుతున్నాయి. రాజకీయ అనుభవం ఉన్నవారిని, బూత్ ల మేనేజ్ మెంట్ లో నిష్ణాతులైన వారిని ప్రజారాజ్యం పార్టీ తీసుకోబోతోంది. జనం మధ్య ఎండల్లో తిరగడం వల్ల చిరంజీవి మొహం నల్లబడినా, జన సముద్రాలను చూసి ఆయన హృదయం విశాలమైనట్టు కన్పిస్తోంది. చివరికి ఏం జరుగుతుందో రాజకీయ తెరమీద చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+