హరికృష్ణ సిన్మా కోపం

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్టీఆర్ కుటుంబ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. నందమూరి హీరోలందరూ బాలకృష్ణ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం కోస్తా ఆంధ్రలో ఈసారి ప్రధాన ప్రచార సారధి పురంధరేశ్వరే కానున్నారు. ఆమె ఎన్టీఆర్ కుమార్తె కావడం, కాంగ్రెస్ పార్టీ తరఫున బాగా మాట్లాడగలగడం ఈ ప్రాముఖ్యతకు కారణం.
చంద్రబాబు నాయుడి చేతిలో మోసపోయానని ఫీలవుతూ గత ఎన్నికల్లో ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయనతో పాటు పురంధరేశ్వరి కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడం, ఒక ఎమ్మెల్యేగా, ఒకరు ఎంపీగా ఎన్నిక కావడం చకచకా జరిగిపోయాయి. వాళ్ళ రాజకీయ క్రీడ మంచి ఫలితాలనే ఇచ్చింది. పురంధరేశ్వరి నేడు సోనియా కుటుంబంలో, కేంద్ర ప్రభుత్వంలో మంచి పలుకుబడి సంపాదించుకున్నారు.












Click it and Unblock the Notifications