చిరు సీన్ ను కట్ చేస్తున్నారా?brచిరంజీవికి చిత్రసీమలో పెరుగుతున్న వ్యతిరేకులు, ఎందుకిలా?....

తెలుగు చలనచిత్ర మండలి అధ్యక్షుడి హోదాలో ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ చిరంజీవి మీద విమర్శలు గుప్పించడం తెలుగు చలనచిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతిలో పడేసింది. చిరంజీవి హీరోగా ఎదుగుతున్న దశలో "కోతలరాయుడు" సినిమా నిర్మించిన వ్యక్తి భరద్వాజ. చిరంజీవి ఆ సమయంలో హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆత్మీయంగా చూసుకున్న వ్యక్తి కూడా ఆయనే. అయితే భరద్వాజ చిరంజీవి కంటే దాసరి నారాయణరావునే ఎక్కువగా అభిమానిస్తారు. ఇప్పుడు చిరుకు, దాసరికి మధ్య వార్ ప్రత్యక్షం కావడంతో భరద్వాజ సహజంగానే దాసరి పక్షం వహించినట్టు కనిపిస్తోంది.
చిరంజీవి ఇటీవల సినిమా ప్రముఖులకు ఇచ్చిన తేనేటి విందును స్వయంగా ఆర్గనైజ్ చేసిన భరద్వాజ వారం తిరగక ముందే ప్లేటు ఫిరాయించడం చర్చనీయాంశమైంది. సినిమా రంగంలో దాసరి నారాయణ రావుకు "మేస్త్రి" అనే పేరు ఉండగా , భరద్వాజకు డిప్యూటీ మేస్త్రి అన్న టైటిల్ ఉంది. సినిమా కార్మికులకు కూడా నాయకుడినని చెప్పుకునే భరద్వాజ పేరుకు కమ్యూనిస్టు అయినా, ఎంతో మంది కార్మికులకు అన్యాయం చేశారన్న విమర్శలు ఉన్నాయి. అయితే చిరంజీవి తనకు ఇవ్వాల్సినంత విలువ ఇవ్వకపోవడం వల్లనే భరద్వాజ ఇలా ఎదురు తిరిగారా? మరే ఇతర కారణాలు ఉన్నాయా? అన్న విషయాలను లోతుగా పరిశీలించవలసి ఉంది.
చిరంజీవి పిల్లికి బిచ్చం పెట్టని వ్యక్తి అని రోజా విమర్శించింది. చిరంజీవి సినిమా పరిశ్రమకు చేసింది ఏమీలేదని, పరిశ్రమకు సంబంధించిన సేవా కార్యక్రమాల్లో ఆయన కంట్రిబ్యూషన్ ఏదీ లేదని భరద్వాజ అంటున్నారు. గతంలో చిరంజీవి సినిమాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో " మొదటి రెండు వారాల్లో టికెట్ రుసుం ఎంతైనా పెట్టుకోవచ్చు" - అనేది చిరంజీవి కోసమే వచ్చింది. దాసరి పట్టుబట్టి ఆ జీవోను ఇటీవల రద్దు చేయించారు. ఇదే కొసమెరుపు.












Click it and Unblock the Notifications