ఇక రాష్ట్రంలో "జయ"ప్రద వెలుగు

జయప్రదకు ఎన్టీ రామారావు రాజకీయ జీవితాన్ని ప్రసాదించారు. ఆమెను తెలుగు దేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యురాలిని చేశారు. ఎన్టీఆర్ ను దించేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జయప్రద ప్రభ వెలిగింది. ఆమె తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కూడా సేవలు అందించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడితో ఆమెకు విభేదాలు వచ్చాయి. 2004 లోక్ సభ ఎన్నికల ముందు ఆమె సమాజ్ వాది పార్టీలో చేరి, తన రాష్ట్రం కాకపోయిన ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ నియోజక వర్గం నుంచి లోక్ సభకు ఎన్నిక కావడం విశేషం.
గతంలో మిత్రులుగా ఉన్న చంద్రబాబు, ములాయం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రత్యర్ధులుగా మారారు. ఈ నేపధ్యంలో ములాయం సింగ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి సారించారు. చిరంజీవి పార్టీతో సమాజ్ వాది పార్టీ పొత్తు కుదుర్చునేలా చూడమని ఆయన జయప్రదను పురమాయించినట్టు సమాచారం. ఇటీవల జయప్రద చిరంజీవిని అదే పనిగా పొగిడేయడానికి ఇదే కారణమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications