చిరు రాజకీయంపై పెను సందేహాలు

చిరంజీవి శిబిరంలో సూడో కమ్యూనిస్టులు పాగా వేయడంతో నేడు అయోమయ పరిస్ధితి నెలకొంది. కులం కాకుండా మరో రకంగా ముందుకు రావాలని చిరంజీవికి సలహాలు అందుతున్నాయి. కానీ భారతదేశానికి సంబంధించినంత వరకు కులమే సామాజిక సత్యం. కమ్యూనిస్టులు కుల రహిత సమాజాన్ని కాంక్షించినా అది కొన్ని శతాబ్దాల వరకు సా ధ్యమయ్యే విషయం కాదు.
చిరంజీవికి ఆయన కులం ముద్ర పడినా పడక పోయినా రాష్ట రాజకీయాల్లో పెద్ద స్కోప్ ఉంది. ఆయన దానిని ఎంత బాగా ఉపయోగించుకుంటాడో అన్నది ఆయన ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత కానీ తెలియదు. చిరంజీవి ధీరోదాత్తంగా పబ్లిక్ ప్రసంగాలు చేస్తే తప్ప ఆయనకు లాభం జరిగే అవకాశాలు కన్పించడం లేదు. తెగించిన రీతిలో కొదమ సింహంలా మాట్లాడితే తప్ప ఆయనను జనం అంగీకరించే పరిస్ధితులు కన్పించడం లేదు.












Click it and Unblock the Notifications