మోహన్ బాబా? మజాకా?brటీవీ 9 ఆఫీసుపై మోహన్ బాబు ప్రతాపం, అంతా కామ్, ఎలా?

మోహన్ బాబు కుమారుడికి, ముఖ్యమంత్రి సోదరుడి కూతురికి ఈమధ్య ప్రేమ వివాహం కుదిరిన సంగతి తెలిసిందే. ఆ వార్త బయటికి పొక్కగానే టీవీ 9 లో స్క్రోలింగ్ ప్రారంభమైంది. మిగితా టీవీలు కూడా దాన్ని అనుసరించాయి. ఇటువంటి సంఘటనల నుంచి గరిష్టంగా లాభం పొంది, టీఅర్ పి రేటింగ్స్ పెంచుకోవాలనుకునే టీవీ 9 రాత్రి ఏడున్నరకు ఆ ప్రేమ కథపై ప్రత్యేక కథనం అని ఊదరగొట్టసాగింది. అది చూసిన మోహన్ బాబు వీళ్ళు ఎటువంటి దృశ్యాలు చూపిస్తారోనని కంగారు పడి, ఆ తర్వాత ఆవేశం తెచ్చుకుని కొడుకుతో సహా టీవీ 9 ఆఫీసుకు వెళ్ళి బీభత్సం సృష్టించాడు. మొదట అడ్డుకున్న సెక్యూరిటీ గార్డును చితకబాదాడు. ఆ తర్వాత సిఇవో రవి ప్రకాష్ కేబిన్ వద్దకు వెళ్ళాడు.
రవి ప్రకాష్ ఆ సమయంలో ఆఫీసులో ఉండకపోవడంతో, అతని తర్వాత న్యూస్ చూసే వాళ్ళు ఎవరని మోహన్ బాబు పళ్ళు నూరుతూ ప్రశ్నించాడు. " నన్ను చిరంజీవిలా చేతకాని వాడనుకుంటున్నారా? చిరంజీవి కుమార్తె ప్రేమ పెళ్ళిపై మీరు అనవసర దుమారం లేపారు. ఇప్పుడు మాకుటుంబ విషయాల జోలికి వచ్చారా, మిమ్మల్ని ఇక్కడే తెగనరికి జైలుకి వెళ్తా జాగ్రత్త" అని బెదిరించాడట. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా భయం భయంగా కింది సిబ్బంది తెలియజేశారట. మోహన్ బాబు అన్నంత పని చేస్తాడు, ఆ స్క్రోలింగ్ ఆపేసి, మోహన్ బాబుకు క్షమాపణలు చెప్పి, శాంత పరిచిపంపడని రవి ప్రకాష్ తన సిబ్బందికి సూచించినట్టు తెలిసింది. తాడిని తన్నేవాడుంటే, వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడన్న సామెత ఇక్కడ నిజమైంది.












Click it and Unblock the Notifications