రామ్ గోపాల్ వర్మని కాదన్న రామోజీరావు

రామ్ గోపాల్ వర్మ ఓ ఆర్టికల్ రామోజీరావు నడుపుతున్న న్యూస్ టైమ్ పత్రికకు పంపాడు. అయితే ఆ న్యూస్ హెడ్ లైన్ ఏమిటంటే ముప్పై మిలియన్ల మందిని చంపిన ఒక ఐడియా('The idea that killed 30 million people'). హిట్లర్ సిద్దాంతాలను మనసులో పెట్టుకుని భారీ స్దాయిలో వినాసనానికి పాలుపడ్డ ఓ ఫిలాసఫర్ గురించి ఆ కధనం. మంచి రెస్పాన్స్ వచ్చింది. అది చూసి రామోజీరావు గారు ఇంప్రెస్ అయ్యారు. వెంటనే రాముని కలవమన్నారు.
రాము ఆయనని కలవటం జరిగిపోయింది. తాను సినిమా దర్శకుడిని అవ్వాలని ఆయన ముందు ప్రపోజల్ పెట్టారు. అయితే ఎక్సపీరియన్స్ లేని వారు డైరక్ట్ చేయలేరని ఆయన ఒప్పుకోలేదుట. చాలా సేపు వాదించాడుట. అయినా ఫలితం లేదుట. దాంతో వర్మ బయిటకు వచ్చేసాడు. తర్వాత కొంత కాలానికి దర్శకుడుగా ప్రపంచానికి పరిచయమయ్యాడు. ఇదంతా రామ్ గోపాల్ వర్మ స్వగంగా తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం రాము మీడియాని విమర్శిస్తూ ఓ హిందీ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.












Click it and Unblock the Notifications