• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

'సత్యం'పై అంత ప్రేమా?

By Staff
|

Ramalinga Raju
హైదరాబాద్: వాటాదారులు, ఆర్ధిక నిపుణుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం భూమి రూపంలో మరో ఫేవర్ చేయడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. వైజాగ్ లో బిపివో కోసం ప్రైమ్ ల్యాండ్ పొందిన ఈ కంపెనీ ఇప్పుడు విశాఖ శివారులోని కాపులుప్పాడ వద్ద 50 ఎకరాలను అతి తక్కువ రేటుకు ప్రభుత్వం నుంచి పొందింది. సత్యం యాజమాన్యం చేసిన భారీ పైరవీ ఫలితంగానే ఈ డీల్ విజయవంతమైనట్టు తెలుస్తోంది. నిబంధనలను సైతం ఖాతరు చేయకుండా సుమారు రూ. 300 కోట్ల విలువైన భూమిని కేవలం ఐదు కోట్లకు ధారాదత్తం చే సింది. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో సొ మ్ము చేతులు మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళితే....విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కాపులుప్పాడ ఐటీ పార్కులో సత్యం కంప్యూటర్స్‌ సంస్థకు 50 ఎకరాల భూ మిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇ చ్చింది. ఇందుకు ఎకరా రూ. 10 లక్షల ధరను నిర్ణయిస్తూ ఈ నెల నాల్గవ తేదీన జీవో నం బరు 1439 జారీ చేసింది. తక్షణమే భూమిని సత్యంకు అప్పగించాలని ఆ జీవోలో ఏపీఐఐసీని ఆదేశించింది. కాపులుప్పాడ ఐటీ పార్కు లో తమ సంస్థ ఏర్పాటుకు సత్యం కంప్యూటర్స్‌ మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంది. కాల్‌ సెంటర్‌ కోసం విశాఖ నగర నడిబొడ్డున ఇంతకుముందే అత్యంత ఖరీదైన స్థలం పొం దిన ఈ సంస్థ కాపులుప్పాడలోనూ కభూములు కేటాయించాలని కోరింది.

మధురవాడలో ఎకరా రూ.10 కోట్ల ధర వుందని స్వయంగా ఇటీవల రాజీవ్‌ గృహక ల్ప సముదాయాన్ని ప్రారంభించినప్పుడు ము ఖ్యమంత్రి వైఎస్‌ పేర్కొన్నారు. కాపులుప్పాడలో వుడా భూముల వేలంలో ఎకరా నా లుగు నుంచి ఆరు కోట్ల రూపాయల వరకు వి క్రయాలు జరిగాయి. ఎండాడలో గృహ నిర్మా ణం కోసం హౌసింగ్‌ బోర్డుకు ఎకరా మూడున్నర కోట్లకు ప్రభుత్వం భూమి కేటాయించింది.

ఇంకా అనేక సంస్థలకు ఎకరా కోటి రూపాయలకు పైగా ధర నిర్ణయిస్తున్న ప్రభుత్వం సత్యంకు కేవలం ఎకరా పది లక్షలకు అప్పగించడం వెనుక ఆంతర్య మేమిటన్న దానిపై అ నేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వుడా రేటు ప్రకారం చూసినా 50 ఎకరాల భూమి మూడు వందల కోట్ల రూపాయల విలువ వుంటుంది. లేదంటే వుడా ధరకు అటు ఇటు గా అయినా లేదా జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదించిన రూ. 80 లక్షలు మేరకైనా ధర నిర్ణయించకుండా అతి తక్కువ ధరకు అప్పగించడం వెనుక ప్రభుత్వ పాలకులకు భారీగా నజరానాలు అందడమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో సెజ్‌లకు భూములను లీజుకు ఇస్తున్న ప్రభుత్వం కాపులుప్పాడలో మాత్రం 'సత్యం'కు ఏకంగా తెగనమ్మి నిబంధనలు ఉల్లంఘించింది. ఇంకా కోస్తా నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం 500 మీ టర్లు, పురావస్తు శాఖ గుర్తించిన కాపులుప్పాడలోని పురావస్తు కట్టడాలకు మూడు వందల మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు చేయరాదన్న నిబంధనలకూ తిలోదకాలిచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X