'వికార' కుట్ర ఏమిటి?

హైదరాబాదులోని మక్కా మసీదులో పేలుడు అనంతరం వికారుద్దీన్ కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర నిఘా సంస్థలు కూడా వికారుద్దీన్ కోసం ప్రయత్నిస్తున్నాయి. జిజెఎస్ తో ఇతనికి సంబంధాలున్నాయి. సిమిలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు కూడా పోలీసులకు సమాచారం ఉంది. ఈ ఏడాది కాలంలో వికారుద్దీన్ ఒమన్, ఖతార్, బంగ్లాదేశ్‌లలో కొంతకాలం ఉన్నట్లు నిఘా వర్గాలు నిర్ధరణకు వచ్చాయి. బంగ్లాదేశ్ లోనే హైదరాబాదు పేలుళ్లకు పథకాన్ని సిద్ధం చేసుకుని తిరిగి వచ్చినట్లు భావిస్తున్నారు. తన కోసం తీవ్రంగా గాలిస్తున్న విషయం తెలిసి కూడా అతను వచ్చాడంటే పెద్ద కుట్రతోనే వచ్చాడని అనుమానిస్తున్నారు. పోలీసుల కళ్లు గప్పేందుకు అతను వేషాలు కూడా మారుస్తుంటాడని చెబుతున్నారు. ఉగ్రవాద చర్యల కోసం అతను పేలుడు పదార్థాల తయారీలోనే కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కూడా శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఇద్దరు వికారుద్దీన్ అనుచరులున్నట్లు తెలుస్తోంది. వారి నుంచి పూర్తి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications