హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలయ్య వర్సెస్ పవన్

By Staff
|
Google Oneindia TeluguNews

Pawan-Balakrishna
హైదరాబాద్: చిరంజీవి తన తమ్ముడిని వెనకేసుకు రావడం ఎన్నో విమర్శలకు దారితీస్తోంది. ప్రజారాజ్యం యువజన విభాగం అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ మొన్న చేసిన వ్యాఖ్యలు సమంజసం కావన్న అభిప్రాయం అన్ని వర్గాల్లో ఉంది.

పవన్ కల్యాణ్ కు సినిమా రంగంలో ఎంతో భవిష్యత్తు ఉంది. ఆయన కాల్షీట్ ఇస్తే చాలనే పెద్ద నిర్మాతలు చాలా మంది ఉన్నారు. అయినా పవన్ రాజకీయ రంగం మీద ఆసక్తి చూపడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆనాడు పరిటాల రవితో వివాదం, ఆ తర్వాత తన మొదటి భార్య విడాకుల వ్యవహారం, అందులో టీవీ మీడియా ఎక్కువగా వ్యవహరించడం పవన్ కల్యాణ్ ను రాజకీయాల వైపు ఆకర్షించి ఉండవచ్చు.

అదే విధంగా ఇద్దరు ముఖ్యమంత్రుల కుటుంబం నుంచి వచ్చిన హీరో బాలకృష్ణ ఆయన ఇంట్లో కాల్పుల తర్వాత ఎన్నో అవమానాలకు గురయ్యాడు. పోలీసు అధికారులు ఇంత అవినీతి పరులా అని ఆయన ఆశ్చర్యానికి గురైనట్టు ఆ సన్నిహితులు చెబుతున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ బాలకృష్ణ అధికార యంత్రాంగం జోలికి పోలేదు. తన సినిమాలు తాను చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి అంత ఆవేశం రావడానికి ప్రధాన కారణం పోలీసు అధికారులే.

ఇప్పుడు అనేక కారణాల వల్ల, మిత్రపక్షాలను కలుపుకుని పోవడం వల్ల చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కొద్దిగా కనిపిస్తున్నాయి. తమ కుటుంబ పార్టీ అయిన తెలుగుదేశం తరఫున మొట్టమొదటిసారిగా హీరో బాలకృష్ణ ప్రచారం చేయనున్నాడు. బాలకృష్ణ ప్రభావం చాలా జిల్లాల్లో ఉంటుందన్న వాస్తవం చిరంజీవి క్యాంప్ కి కూడా బాగా తెలుసు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X