బాబుకు కలిసి వచ్చేనా?

అయితే కాంగ్రెస్ పార్టీకి ఢీ అంటే ఢీలా పోటీ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ కాలంలో ఏర్పడిన సంస్ధాగత నిర్మాణం పటిష్టంగా ఉండడం, బిసీల పార్టీగా ఎన్టీఆర్ హయాం నుంచి ఇక పేరు ఉండడం తెలుగుదేశం పార్టీకి లాభించే అంశాలు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపు రెండు కోట్ల కుటుంబాలకు తెల్ల కార్డులు లభించడం, వారందరికీ రెండు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం అందుబాటులో ఉండడం, వృద్ధాప్యపు పెన్షన్లను కాంగ్రెస్ ప్రభుత్వం విరివిగా ఇవ్వడం ఆ పార్టీకీ లాభించే అంశాలు.
గతంలో చంద్రబాబు నాయుడు నేల విడిచి సాము చేయడం, సబ్సిడీలకు వ్యతిరేకంగా మాట్లాడడం గ్రామీణ జనం ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. అయితే అవినీతి విషయంలో కాంగ్రెస్ కంటే తెలుగుదేశం బెటర్ అన్న విషయాన్ని జనం గ్రహించినట్టు కనిపిస్తోంది. కానీ ఆ అంశం ఎన్నికలలో ఎలా ప్రతిఫలిస్తుందోనన్న విషయం స్పష్టం కావడం లేదు.
చంద్రబాబు మహాకూటమి అధికారంలోకి వచ్చేటట్టే పైకి కన్పిస్తున్నా ఇందులో అనేక అంశాలు అంతర్గతంగా ఇమిడి ఉన్నాయి. హైటెక్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి పేరున్నా, అభివృద్ధి ముఖ్యమంత్రిగా, గ్రామీణుల ఫేవరైట్ గా రాజశేఖరరెడ్డి పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చెరో 90 స్ధానాలు తెచ్చుకుని, చిరంజీవి పార్టీ యాభై స్ధానాలు సంపాదించుకుంటే హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుంది. ఆ పరిస్ధితిలో చిరంజీవిని ఒక ఏడాది పాటు ముఖ్యమంత్రిని చేసి, ఆయన విఫలమైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా కేంద్రం స్ధాయిలో ఇప్పటినుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications