బాబు బాధలు ఎన్నో!

తెలుగు మహిళ అధ్యక్ష పదవిని సీతా దయాకర్ రెడ్డికి ఇచ్చినా ఆమె దానిని తృణప్రాయంగా తీసుకుని తిరస్కరించారు. చంద్రబాబు నాయుడికి అది పెద్ద చెప్పు దెబ్బ. చంద్రబాబు ఇంకా నియంతగా వ్యవహరిస్తున్నారనడానికి, ఊహల్లో విహరిస్తున్నారనడానికి ఇంతకంటె మంచి ఉదాహరణ ఏం కావాలి?
గత ఎన్నికల్లో గుడిపూడి జంగాల వంటి కమ్యూనిస్టులను వేసుకునీ ఆయన ముందుకు వెళ్ళి బొక్కబోర్లా పడ్డారు. వైయస్ కు గ్రౌండ్ తెలుసు కానీ చంద్రబాబుకు గ్రౌండ్ రియాలిటీస్ తెలియవన్న విమర్శ ఉంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ తనకున్న జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కారణంగా తాను ఇప్పటికీ ముఖ్యమంత్రి నేమోనన్న వర్చువల్ ఫీలింగ్ లో ఉన్నట్తు కన్పిస్తోంది. చంద్రబాబు నాయుడికి మరో నాలుగేళ్ళ పాటు దూరంగా ఉండాలని బాలకృష్ణ, జూనియర్ ఎన్టీ ఆర్ నిర్ణయించుకున్నటు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైయస్ లేని స్ధితిలో డల్ గా ఉండడంతో చంద్రబాబు నాయుడు చాకచక్యంగా ముందుకు దూసుకేళ్ళాలని యోచిస్తున్నారు. కానీ సొంత పార్టీలోనే ఆయనకు అపశృతులు ఎదురవుతున్నాయి.












Click it and Unblock the Notifications