చిరంజీవి నిస్తేజం!

చిరంజీవి తన ఆరోగ్యంపై, ఫిట్ నెస్ పై శ్రద్ధ వహించడం లేదన్నది వాస్తవం. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల్లో ఆయన మొహం కళా విహీనంగా కన్పిస్తోంది. సినిమాల్లో ఎటూ నటించే అవకాశం లేనందున ఆయనలో సౌందర్య స్పృహ లోపించింది. హార్డ్ కోర్ రాజకీయ నాయకుడి పాత్రలో ఆయన రఫ్ అండ్ టఫ్ గా ఉండాలనుకుంటున్నట్టు కన్పిస్తోంది.
ఇక పార్టీ ప్రజారాజ్యం నుంచి వలసలు చిరంజీవిని బాగా కుంగదీస్తున్నాయి. తాజాగా తమ్మినేని సీతారామ్ టిడిపిలోకి వెళ్తున్నారు. ఇక ప్రజారాజ్యంలో మిగిలింది చిరంజీవి కాకుండా ఆ పదిహేడు మంది ఎమ్మెల్యేలే.ఓడిపోయినవారు, పోటీ చేయనివారు ఇప్పుడు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు చిరంజీవికి సవాలు కాబోతున్నాయి. ఆయన పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. అందువల్ల ఆయన విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉంటుంది. దీనితో ఆయన గ్లామర్ మరింత తగ్గే అవకాశముంది. చిరంజీవి గ్లామర్ తగ్గిపోవడం ఆయన అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications