బాబు స్క్రిప్టు కాపీలో చిరు!

ఈ విధానం ఇప్పటికే టీడీపీలో అమలులో ఉండటం తో తమ పార్టీలోనూ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల మేనేజర్లతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న సమావేశం నిర్వహించారు. భవిష్యత్‌లో వారి పనితీరుపై దిశ నిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు కొంత మేర అదనపు బడ్జెట్‌ను జిల్లా కార్యాలయాలకు కేటాయించి, మేనేజర్ పర్యవేక్షణ పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని జిల్లాల్లో పార్టీ కా ర్యాలయాలు కార్యకర్తలకు అందుబాటులో ఉండే లా వీలైనంత మేర మార్పులు చేయాలని జిల్లా మేనేజర్లకు సూచించారు. పార్టీ ఆవిర్భావ సమయంలో చేరిన నేతల ఇష్టానుసారం కార్యాలయాల్ని ప్రారంభించారు. దీంతో పలు జిల్లాల్లో వివాదాలు చోటుచేసుకున్నాయి. ఇకపై అలాంటి పరిస్థితులు తలెత్తకుండా జిల్లా కార్యాలయాల్ని తీర్చిదిద్దాలన్నారు.












Click it and Unblock the Notifications