బాబే కాంగ్రెసు లక్ష్యం

చంద్రబాబును, ఆయనకు మద్దతుగా నిలిచిన ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల యాజమాన్యాలను ఎదుర్కోవడంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఎనలేని తెగువను ప్రదర్సించారు. ఇప్పటి వరకు కాంగ్రెసుకు అంతటి సామర్థ్యం, సాహసం కలిగిన నాయకుడు మర్రి చెన్నారెడ్డి మినహా ఎవరూ కనిపించలేదు. వైయస్ వారసత్వాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పుణికి పుచ్చుకున్నారని, వైయస్ లాగా చంద్రబాబును ఎదుర్కోవాలంటే వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడమే మంచిదనే వాదన బలంగానే వినిపిస్తోంది. అయితే కాంగ్రెసులోని అంతర్గత వైరుధ్యాలను ఆలోచించాల్సిన అగత్యంలో పార్టీ అధిష్ఠాన వర్గం పడింది. వైయస్ రాజశేఖర రెడ్డి తన విజయాల ద్వారా, ప్రజల్లోకి చొచ్చుకుపోవడం ద్వారా పార్టీలో తనకు మరొకరు పోటీ రాకుండా చూసుకున్నారు. రాజకీయంగా ఆయన ముందు కాంగ్రెసులో మరో నాయకుడు ధీటుగా నిలవలేకపోయాడు.
వైయస్ జగన్ విషయంలో అనుభవ రాహిత్యం, వయస్సు కూడా అడ్డంకిగా మారాయి. వైయస్ ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావుపై నమ్మకంతో పార్టీ అధిష్ఠానవర్గం జగన్ కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాల్సి ఉంటుంది. ఈ సమయంలో పార్టీలో విభేదాలు తలెత్తకుండా ఏ విధంగా వ్యవహరించలగలరనే సందేహం మిగిలే ఉంటుంది. కొత్త నేత ఎంపికపై ఇప్పుడే కసరత్తు చేయడం లేదని చెబుతున్నప్పటికీ కాంగ్రెసు అధిష్ఠానవర్గం సీరియస్ గానే ఆలోచిస్తున్నట్లు పరిణామాలు తెలియజేస్తున్నాయి.












Click it and Unblock the Notifications