తెలంగాణకు వరంగల్, ఆంధ్రకు బెజవాడ, యుటి గా హైదరాబాద్?

విజయవాడ రాజధాని కావడం సమైక్యాంధ్ర వాదులకు సహజంగానే నచ్చదు. ప్రత్యేకాంధ్ర అంటున్న వసంత నాగేశ్వరరావుపై, బిజెపి నాయకులపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. నిజానికి కోస్తాంధ్రలో ఇప్పుడు సమైక్యవాదానికి, ప్రత్యేకవాదానికి మధ్య సంఘర్షణ జరుగుతోంది. విజయవాడను రాజధానిగా అభివృద్ధి చేసుకోడానికి కేంద్రం నిధుల ప్యాకేజిని ప్రకటించాలి. వసంత నాగేశ్వరరావు అంటున్నట్టు ఆంధ్రులు కొంతకాలం హైదరాబాద్ నే రాజధానిగా చేసుకోడానికి అనుమతి పొందాలి.
అందరి దృష్టీ ఇప్పుడు హైదరాబాద్ పైనే ఉంది. కేంద్రం కూడా హైదరాబాద్ హోదాపై కసరత్తు చేసినట్టు ఈ చానల్ ప్రసారం చేసింది. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసే విషయం పరిశీలించమంటూ న్యాయ, హోం, ఆర్ధిక శాఖల కార్యదర్శులతో కూడిన టాస్క్ ఫోర్స్ కు సూచించవచ్చు.ఈ టాస్క్ ఫోర్స్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి అతి త్వరలో నివేదిక సమర్పించే అవకాశముంది. అన్నీ సజావుగా సాగితే జనవరి రెండో తేదీన చిదంబరం తన మూడో ప్రకటన ద్వారా ఈ టాస్క్ ఫోర్స్ నియామకాన్ని తెలియజేవచ్చు.












Click it and Unblock the Notifications