పదవి అవసరమా?

మరో విషయం కూడా చర్చల్లో ఉంది. అల్లు అరవింద్ సినీ నిర్మాణంలో నిండా మునిగిపోయి ఉన్నారు. గజినీ హిందీ సినిమా, మగధీర సూపర్ హిట్ అల్లు అరవింద్ కు భారీగా లాభాలు తెచ్చిపెట్టాయని అంటున్నారు. దీంతో ఆయన సినిమా నిర్మాణాలపై మరింత దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. తన కుమారుడు అల్లు అర్జున్ తో కూడా ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి సిద్దమవుతున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టే సమయం దొరకదని, అందువల్లనే పార్టీ కార్యవర్గంలో ఆయన చేరలేదని అంటున్నారు. అయితే ప్రధాన కారణం మాత్రం విమర్శల నేపథ్యంలో పార్టీ పదవి తీసుకోకపోవడమే మేలని భావించడమని చెబుతున్నారు. పార్టీ పదవి లేనంత మాత్రాన అల్లు అరవింద్ ప్రాబల్యానికి లోటేమీ ఉండదని అందరికీ తెలిసిన విషయమే.
చిరంజీవి ప్రతి అడుగు కూడా అల్లు అరవింద్ మార్గదర్సకత్వంలోనే పడుతుందనే విషయం సర్వ విదితం. అందువల్ల అల్లు అరవింద్ అనుకున్న ప్రకారమే పార్టీ నడుస్తుందని, దానికి పదవి తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే కాలంలో పార్టీలో పెద్దగా అల్లు అరవింద్ నిర్వర్తించాల్సిన పాత్ర కూడా పెద్గగా ఉండదు. మళ్లీ ఎన్నికలు వచ్చేనాటికి చక్రం తిప్పడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని అంటున్నారు. తాను చిరంజీవిని కాపాడుకుంటూ వస్తున్నానని అల్లు అరవింద్ స్వయంగా తనపై విమర్శలు వచ్చినప్పుడు అన్నారు. అందువల్ల చిరంజీవి అడ్గుగా నిలబడడానికి ఆయనకు పదవే ఉండాల్సిన అవసరం లేదని అంటున్నారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
హైదరాబాద్ ఫేమస్ ఉస్మానియా బిస్కెట్ ను చెడగొట్టారు కదరా.. దరిద్రుల్లారా -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
మూసీ తీరాన మహత్తరం -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు!












Click it and Unblock the Notifications